ETV Bharat / crime

లేడీ ఫోన్​ చేసింది.. రూ.98 వేలు కాజేసింది

author img

By

Published : May 1, 2021, 3:09 PM IST

lady called credit card offers, cheating rupees 98 thousand
లేడీ ఫోన్​ చేసింది.. రూ.98 వేలు కాజేసింది

భాగ్యనగరంలో ఓ వ్యక్తికి క్రెడిట్​ కార్డు ఆఫర్​ ఉందంటూ ఓ మహిళ ఫోన్​ చేసింది. దీంతో ఆ వ్యక్తి సున్నితంగా తిరస్కరించాడు. మహిళ తన ఆఫర్​ను డీయాక్టివేట్​ చేయాలంటే అతని క్రెడిట్​ కార్డు వివరాలు తెలపాలని కూపీ లాగింది. నమ్మిన అతను ఓటీపీతో సహా అన్ని వివరాలు చెప్పాడు. అంతే వెంటనే అతని ఖాతాలో నుంచి 98 వేల రూపాయలు డెబిట్​ అయ్యాయి. మోసపోయానని నెమ్మదిగా తెలుసుకున్న బాధితుడు సైబర్​ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

క్రెడిట్ కార్డు ఆఫర్ ఉందంటూ సైబర్ నేరగాళ్ల చేతిలో ఓ వ్యక్తి మోసపోయిన ఘటన హైదరాబాద్ చింతల్​లో జరిగింది. జీడిమెట్ల పీఎస్ పరిధి చింతల్​కు చెందిన కిషోర్​కు క్రెడిట్ కార్డు ఆఫర్ ఉందంటూ ఓ మహిళ ఫోన్ చేసింది. ఆఫర్ తనకు అవసరం లేదంటూ మహిళకు కిషోర్ తెలిపాడు.

Complaint letter made by the victim
బాధితుడు చేసిన ఫిర్యాదు లేఖ

తన ఆఫర్​ను డీయాక్టివేట్ చేయాలంటే అతని క్రెడిట్ కార్డు వివరాలు చెప్పాలని కిషోర్​ను సైబర్ మహిళ కోరింది. అది నమ్మి అతను క్రెడిట్ కార్డు వివరాలు, ఓటీపీ తెలిపాడు. దీంతో తన అకౌంట్ నుంచి రూ.98,000 మాయమయ్యాయి. మళ్లీ తనకు ఫోన్​ చేయగా ఓటీపీ చెప్తా అని చీట్​ చేసిందని బాధితుడు పేర్కొన్నాడు. మోసపోయానని గ్రహించిన బాధితుడు కిశోర్ జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి : కత్తులతో ఇరువర్గాల ఘర్షణ... ఐదుగురికి తీవ్ర గాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.