ETV Bharat / crime

కరోనాతో కార్పొరేటర్ కుమార్తె మృతి

author img

By

Published : May 9, 2021, 12:19 PM IST

Updated : May 9, 2021, 12:32 PM IST

bjp corporator's daughter died, corona deaths in Hyderabad
కరోనాతో కార్పొరేటర్​ కుమార్తె మృతి, హైదరాబాద్ వార్తలు, హైదరాబాద్​లో కరోనా మరణాలు

హైదరాబాద్​ గుడిమల్కాపూర్​ భాజపా కార్పొరేటర్ దేవన కరుణాకర్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. కరోనా వైరస్ సోకి అతని కుమార్తె మృతి చెందారు.

హైదరాబాద్​లో గుడిమల్కాపూర్ భాజపా కార్పొరేటర్ దేవన్ కరుణాకర్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన కుమార్తె ఆవుల భవాని(28) కరోనాతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

గత నెల 20న భవాని.. మగశిశువుకు జన్మనిచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. డెలివరీ జరిగిన ఆస్పత్రిలోనే కరోనా సోకినట్లు కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. ఐదు రోజులుగా వెంటిలేటర్​పై ఉన్న భవాని ఆదివారం రోజున మరణించారు.

Last Updated :May 9, 2021, 12:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.