ETV Bharat / crime

boy fell on manhole ring : మ్యాన్​హోల్​రింగ్​పై పడి మృతిచెందిన బాలుడు

author img

By

Published : Dec 2, 2021, 10:03 PM IST

boy fell on manhole ring: హైదరాబాద్ నగర శివారు రాజేంద్రనగర్‌ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. జీహెచ్‌ఎంసీ అధికారుల నిర్లక్ష్యంతో ఓ బాలుడు మృతి చెందాడు.

boy fell on manhole ring
boy fell on manhole ring

boy fell on manhole ring : నాలుగేళ్ల బాలుడు ఆడుకుంటూ మ్యాన్​హోల్​ రింగ్​పై పడి మృతి చెందాడు. ఈ ఘటన హైదరాబాద్​ నగర శివారు రాజేంద్రనగర్​ ఠాణా పరిధిలో జరిగింది. స్థానిక సులేమాన్‌నగర్‌లో.. మ్యాన్​హోల్​పై వేయాల్సిన రింగ్​ను జీహెచ్​ఎంసీ సిబ్బంది రోడ్డుపై పడేశారు. ఈ క్రమంలో నాలుగేళ్ల బాలుడు అబ్దుల్‌ రహ్మాన్‌.. ఆడుకుంటూ దానిపై పడ్డాడు.

గాయపడిన బాలుడు ఘటనా స్థలిలోనే మృతి చెందాడు. అనుకోని ప్రమాదంలో బాలుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. జీహెచ్​ఎంసీ అధికారుల నిర్లక్ష్యం వల్లనే తమ బిడ్డ మృతిచెందాడని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు.

read also: Accident in Srisailm Ghat Road: బస్సులోంచి తల బయటపెట్టింది.. ఊహించని దారుణం జరిగిపోయింది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.