ETV Bharat / crime

నల్లమలలో మరోసారి చెలరేగిన మంటలు

author img

By

Published : Mar 18, 2021, 10:24 AM IST

కొల్లాపూర్‌ మండలం గుడిగట్టు సమీపంలోని నల్లమల ఆడవిలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. బుధవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో ఎండిన గడ్డి ద్వారా మంటలు వ్యాపించాయని అటవీశాఖ రేంజర్‌ రవీందర్‌నాయక్‌ చెప్పారు.

నల్లమలలో మరోసారి చెలరేగిన మంటలు
నల్లమలలో మరోసారి చెలరేగిన మంటలు

నాగర్​కర్నూలు జిల్లా కొల్లాపూర్ సమీపంలో నల్లమల అడవిలో గురువారం సాయంత్రం మంటలు చెలరేగాయి. కి.మీ. మేర చెట్లు కాలిబూడిదయ్యాయి. ఎగిసి పడిన మంటలను అటవీశాఖ అధికారులు, అగ్నిమాపక సిబ్బంది ఆరు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

మంటలు సమీపంలోని మామిడితోటలకు కూడా వ్యాపిస్తాయని రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఎట్టకేలకు మంటలు అదుపులోకి రావటంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. అడవిలోని విలువైన నారవేప కలప కాలిపోయినట్లు రేంజర్‌ తెలిపారు. అనుమతి లేకుండా అడవిలోకి ఎవరు వెళ్లినా చర్యలు తీసుకుంటామని రేంజర్‌ హెచ్చరించారు.

ఇదీ చూడండి: విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన లారీ.. డ్రైవర్ మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.