ETV Bharat / crime

అమానుషం: కన్నకూతురిపైనే తండ్రి అత్యాచారం

author img

By

Published : May 30, 2021, 10:32 AM IST

father rape
కన్నకూతురిపై అత్యాచారం

కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ కీచక తండ్రి వావివరుసలు మరిచి కన్న కూతురిపై అత్యాచారం చేశాడు. తన తండ్రి చేసిన ఘాతకంపై ఆ కూతురు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.

కంటికి రెప్పలా కాపాడుతాడనుకున్న కన్న తండ్రే ఆ బాలిక పాలిట కాలనాగయ్యాడు. కుమార్తెపై తండ్రి అత్యాచారానికి పాల్పడిన ఘటన ఏపీలోని విజయనగరం జిల్లాలోని ఓ గిరిజన గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బాలిక (15) పదో తరగతి చదువుతోంది.

ఆమె తండ్రి.. అత్తింటికి తీసుకెళ్తానని నమ్మించి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం కుటుంబ సభ్యులకు తెలపడంతో వారి సహకారంతో బాధితురాలు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి తండ్రిపై ఫిర్యాదు చేసింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పోక్సో, అత్యాచారం కేసులు నమోదు చేసి రిమాండుకు తరలించారు. ఇంతకు ముందు అతనిపై హత్యానేరం కేసు ఉందని పోలీసులు చెప్పారు.

ఇదీ చదవండి: Kishan Reddy: 'వ్యాక్సిన్​ వినియోగంలో ప్రపంచంలోనే మూడోస్థానం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.