ETV Bharat / crime

ఏనుగుల దాడి... వ్యక్తి మృతి

author img

By

Published : Apr 1, 2021, 10:20 AM IST

ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఏనుగులు దాడి చేయడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.

elephant attack
elephant attack, ap chittur

ఏపీలోని చిత్తూరు జిల్లా యాదమరి మండలం తంజావూరులో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఉదయం బహిర్భూమికి వెళ్లిన ఓ వ్యక్తిపై దాడి చేశాయి. ఘటనలో తీవ్రంగా గాయపడిన అతడు మృతి చెందాడు.

గ్రామానికి చెందిన బధిరుడు వెల్లిగావ్​ ఉదయం బహిర్భూమికి వెళ్లాడు. ఒంటరిగా ఉన్న అతనిపై ఏనుగులు దాడి చేశాయి. తప్పించుకునేందుకు బిగ్గరగా కేకలు వేశాడు. కేకలు విని సమీపాన ఉన్నవారు వెళ్లి చూడగా.. తీవ్రగాయాలతో మృతి చెందాడు. అధికారులు సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు.

ఇదీ చదవండి: విద్యుత్​ స్తంభానికి కట్టేసి కొట్టి... హత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.