ETV Bharat / crime

SBI Fake Call Centre: కోట్లు కొల్లగొట్టిన నకిలీ కాల్ సెంటర్లు.. సైబర్ ముఠాల అరెస్ట్

author img

By

Published : Dec 3, 2021, 6:19 AM IST

Fake call centres: ఎస్బీఐ నకిలీ కాల్‌ సెంటర్‌, ధని లోన్‌బజార్ వెబ్‌సైట్‌ పేరుతో దేశవ్యాప్తంగా వందల కోట్ల రూపాయల మోసాలకు పాల్పడుతున్న ముఠాలను సైబారాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. స్పూఫింగ్ యాప్‌ ద్వారా ఎస్బీఐ కస్టమర్‌ కేర్‌ నుంచే ఫోన్‌ చేస్తున్నట్లు నమ్మించి మోసాలకు పాల్పడుతున్నట్లు తేల్చారు. రెండు ముఠాలకు చెందిన నిందితుల నుంచి ల్యాప్‌టాప్‌లు, ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర వెల్లడించారు.

SBI Fake Call Centre
కోట్లు కొల్లగొట్టిన నకిలీ కాల్ సెంటర్లు

కోట్లు కొల్లగొట్టిన నకిలీ కాల్ సెంటర్లు

Fake call centres: దిల్లీ ఉత్తమ్‌నగర్. ఇప్పుడు ఈ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. రుణయాప్‌ల నుంచి మొదలుకొని నకిలీ కాల్‌సెంటర్ల నిర్వహణ వరకు... ఈ ప్రాంతం అడ్డగా మారింది. కొన్నిరోజుల క్రితమే ఆర్బీఎల్ నకిలీ కాల్‌సెంటర్‌ ముఠాను అరెస్టు చేసిన పోలీసులు... తాజాగా అమాయకులను వెన్నువిరుస్తున్న నకిలీ ఎస్‌బీఐ కాల్ సెంటర్‌ గుట్టు రట్టు చేశారు. దేశవ్యాప్తంగా వందల కోట్ల రూపాయలను స్వాహా చేసి.... పోలీసులకు చిక్కకుండా నక్కిన ముఠాను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దిల్లీలో మెరుపు దాడి చేసి పట్టుకున్నారు.

14 మంది అరెస్ట్

SBI fake call center: ఏడాదిలో 33 వేల మందికి కాల్స్‌ చేసి కోట్ల రూపాయలు దండుకున్నారని సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర వెల్లడించారు. ప్రధాన నిందితుడు నిఖిల్‌ నేతృత్వంలో ఈ మోసం జరిగిందని మొత్తం 14 మందిని అరెస్టు చేసి 30 ఫోన్లు, 3 ల్యాప్‌టాప్‌లు, కారు, ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ముఠాపై దేశవ్యాప్తంగా 209 కేసులు నమోదైనట్లు వివరించారు. స్పూఫింగ్‌ యాప్‌తో ఏ నెంబర్ నుంచి ఫోన్ చేసినా.... అసలైన ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు కస్టమర్‌ కేర్‌ నంబర్ 1860-1801-290 నుంచి ఫోన్ వెళ్తుందని స్టీఫెన్‌ రవీంద్ర చెప్పారు.

ధని పేరుతో యాప్​తో మోసాలు

cyber frauds with dhani app: ధని లోన్‌ బజార్‌ పేరుతో రుణాలు ఇప్పిస్తామని మోసం చేస్తున్న మరో ముఠా గుట్టును సైబరాబాద్‌ పోలీసులు రట్టు చేశారు. 14మందిని కటకటాల్లోకి నెట్టారు. నిందితుల్లో మహిళలు కూడా కీలక పాత్ర పోషించారని సీపీ స్టీఫెన్‌ రవీంద్ర వెల్లడించారు. ప్రధాన నిందితుడు అభిషేక్ మిశ్రా పరారీలో ఉన్నాడని తెలిపారు. ద లోన్‌ ఇండియా, ధని లోన్ బజార్‌, పైసా లోన్ హబ్‌, ముద్రలోన్ ఫైనాన్స్‌లకు నకిలీ వెబ్‌సైట్‌లు తయారు చేస్తున్నారని సీపీ పేర్కొన్నారు. నకిలీ వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యాక … వ్యక్తిగత వివరాలు తీసుకుంటారని … ఆ తర్వాత లోన్‌ వచ్చిందని చెప్పి.. పలు చార్జీల కింద డబ్బులు వసూలు చేసి మోసగిస్తారని స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. కస్టమర్‌ కేర్ నుంచి ఫోన్ చేసి వ్యక్తిగత వివరాలు, ఓటీపీలు అడిగితే చెప్పవద్దని ఎలాంటి అనుమానం ఉన్న తమకు ఫిర్యాదు చేయాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఇవీ చూడండి:

Health insurance fraud: ఆరోగ్య బీమా పేరుతో ఘరానా మోసం.. ఇద్దరు మోసగాళ్లు అరెస్ట్​

CP Stephen Ravindra: దేశంలోనే అతిపెద్ద సైబర్‌ మోసాన్ని ఛేదించాం: సీపీ స్టీఫెన్ రవీంద్ర

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.