ETV Bharat / crime

Arrest: నకిలీ ఇన్​స్టా ఖాతాలో మహిళకు వేధింపులు, వ్యక్తి అరెస్ట్

author img

By

Published : Jun 16, 2021, 7:19 PM IST

ఈ మధ్య సామాజిక మాధ్యమాల్లో మహిళలకు వేధింపులు ఎక్కవయ్యాయి. తాజాగా మాదన్నపేట్‌కు చెందిన చిన్న వెంకన్న రాజశేఖర్‌రెడ్డి ఓ మహిళ పేరులో నకిలీ ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్​బుక్​ ఖాతాలు తెరిచాడు. అందులో బాధితురాలి మార్ఫింగ్​ ఫొటోలు పెట్టి వేధించాడు. మహిళ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్ట్(Arrest)​ చేశారు.

Arrest, cyber cirme
అరెస్ట్​, సైబర్​ క్రైమ్​

సామాజిక మాధ్యమాల్లో మహిళ పేరుతో అభ్యంతరకర సందేశాలు పంపుతున్న వ్యక్తిని రాచకొండ సైబర్‌ క్రైం పోలీసులు అరెస్టు(Arrest) చేశారు. అతని వద్ద నుంచి చరవాణి స్వాధీనం చేసుకున్నారు. సైదాబాద్‌ మాదన్నపేట్‌కు చెందిన చిన్న వెంకన్న రాజశేఖర్‌రెడ్డి ఓ మహిళ పేరులో నకిలీ ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్​బుక్​ ఖాతాలు తెరిచాడు. వాటిలో బాధితురాలి మార్ఫింగ్‌ ఫొటోలు పోస్టు చేశాడు.

మహిళ పేరుతో అభ్యంతరక సందేశాలు ఆమె స్నేహితులు, కుటుంబ సభ్యులకు పంపాడు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైబర్‌ క్రైం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాజశేఖర్‌ ఆ మహిళకు పరిచయస్తుడని... ఆమెకు తెలియకుండా కొన్ని ఫోటోలు చరవాణి ద్వారా తీసుకున్నాడని విచారణలో తేలింది. కొద్ది రోజుల తర్వాత అతనితో మహిళ మాట్లాడడం మానేసింది. ఆమెపై కక్ష పెంచుకొన్న అతను అసభ్య సందేశాలు పంపినట్టు పోలీసులు గుర్తించారు.

ఇదీ చదవండి: CP Anjani kumar: జోకర్‌ మాల్‌వేర్‌ ఓపెన్ చేస్తే అంతే సంగతులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.