ETV Bharat / crime

మీరు తాగేవి స్వచ్ఛమైన పాలేనా.. ఇలాంటి 'కల్తీ'గాళ్లు ఉంటారు జాగ్రత్త..!

author img

By

Published : Jan 8, 2023, 6:48 PM IST

ధనార్జనే లక్ష్యంగా కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. ప్రతి వస్తువునూ కల్తీ చేస్తున్నారు. చివరికి పసిపిల్లలు తాగే పాలనూ వదలడం లేదు. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసులు కల్తీ పాలు తయారు చేస్తున్న ఓ ముఠాను అరెస్టు చేశారు.

కల్తీపాలు
కల్తీపాలు

కల్తీ పాలను తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్​వోటీ పోలీసులు కల్తీ పాలను తయారు చేసి హైదరాబాద్, పరిసర ప్రాంతాలకు ప్రతి నిత్యం వేలాది లీటర్లను సరఫరా చేస్తున్న వారిని పక్కా సమాచారం మేరకు పట్టుకున్నారు. భువనగిరి మండలం బిఎన్ తిమ్మాపురం నుంచి తెల్లవారుజామున వాహనాల్లో హైదరాబాద్​కు కల్తీ పాలను సరఫరా చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు.

వారి వద్ద నుంచి 200 లీటర్ల కల్తీ పాలు, పాల తయారీకి ఉపయోగించే కెమికల్ పౌడర్​ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని ఎస్​వోటీ పోలీసులు భువనగిరి రూరల్ పోలీసులకు అప్పగించారు. భువనగిరి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

యాదాద్రి భువనగిరి జిల్లాలో కల్తీపాలను తయారు చేస్తున్న ముఠా అరెస్ట్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.