ETV Bharat / crime

కొకైన్ విక్రయాలపై ఆబ్కారీ శాఖ నిఘా.. ఆఫ్రికా వాసి అరెస్ట్

author img

By

Published : May 24, 2022, 7:23 PM IST

Updated : May 24, 2022, 9:17 PM IST

Cocaine Seized: హైదరబాద్​లో కొకైన్​ను విక్రయిస్తున్న ఆఫ్రికన్​ను ఆబ్కారీ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద కొకైన్​ కొనుగోలు చేసిన మరో ఇద్దరిని సైతం అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 56 గ్రాముల కొకైన్, రెండు వాహనాలు స్వాధీం చేసుకున్నారు. నిందితుడు ఫార్మసీ స్టూడెంట్ వీసాతో భారత్​కు వచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. కేసు వివరాలను హైదరాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ విజయ్ వెల్లడించారు.

Cocaine Seized
కొకైన్ స్వాధీనం

56 గ్రాముల కొకైన్ స్వాధీనం, ముగ్గురిని అరెస్టు చేశాం: విజయ్‌

Cocaine Seized: మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న ఘనా దేశానికి చెందిన వ్యక్తిని ఆబ్కారీ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద కొకైన్ కొనుగోలు చేసిన సందీప్, లియాఖత్ అనే ఇద్దరు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 56 గ్రాముల కొకైన్, ఓ కారు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. ఘానాకు చెందిన మోరిస్... మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్నాడనే సమాచారం మేరకు ఆబ్కారీ పోలీసులు వారం రోజులుగా నిఘా పెట్టారు. పురానాపూల్ వద్ద ఉన్న మోరిస్​ను ఆబ్కారీ పోలీసులు అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా, అతని వద్ద కొకైన్ లభించింది. మోరిస్ ఇచ్చిన సమాచారం మేరకు సందీప్, లియాఖత్​ను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. ఇతరులకు విక్రయించేందుకు సందీప్ కొకైన్ కొనుగోలు చేయగా... తన యజమానికి ఇచ్చేందుకు కొకైన్ కొనుగోలు చేసినట్లు లియాఖత్ ఒప్పుకున్నాడు. లియాఖత్ యజమాని యజ్ఞానంద్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

చార్మినార్​కు చెందిన యజ్ఞానంద్ ఈ ఏడాది జనవరిలో పంజాగుట్ట డ్రగ్స్ కేసులోనూ అరెస్ట్ అయ్యాడు. నైజీరియాకు చెందిన టోనీ నుంచి మాదక ద్రవ్యాలు కొనుగోలు చేసిన 11మంది వ్యాపారుల్లో యజ్ఞానంద్ ఒకరు. నెల క్రితం బెయిల్​పై బయటికి వచ్చిన యజ్ఞానంద్ మళ్లీ మాదక ద్రవ్యాలు కొనుగోలు చేస్తున్నట్లు ఆబ్కారీ పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం పరారీలో ఉన్న యజ్ఞానంద్ కోసం ఆబ్కారీ పోలీసులు గాలిస్తున్నారు. యజ్ఞానంద్​తో పాటు మరికొంత మంది వ్యాపారులు మోరిస్ వద్ద మాదక ద్రవ్యాలు కొనుగోలు చేస్తున్నట్లు ఆబ్కారీ పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. మోరిస్​ను కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించే అవకాశం ఉంది.

"ఆఫ్రికా ఘనా దేశానికి చెందిన మోరిస్.. ఫార్మసీ స్టూడెంట్ వీసాతో భారత్​కు వచ్చాడు. దిల్లీ నుంచి కొకైన్ తీసుకువచ్చి ఇక్కడ అమ్ముతున్నాడు. కాఫీ ప్యాకెట్లలో కొకైన్ పెట్టి విక్రయిస్తున్నాడు. నగరంలోని వనస్థలిపురం, సన్ సిటీ, పురానాపూల్ వద్ద అమ్మకాలు జరుపుతున్నాడు. పురానాపూల్ వద్ద సందీప్​కు మోరిస్ కొకైన్ విక్రయిస్తుండగా పట్టుకున్నాం. స్కూటీలో ఏడు గ్రాముల కొకైన్, నగదు దొరికింది. పట్టుబడిన వ్యక్తి కారులో మరో 11 గ్రాముల కొకైన్ దొరికింది. సన్‌ సిటీలో నివాసం ఉంటున్న ఆఫ్రికన్ ఇంట్లో సోదాలు చేశాం. అక్కడ మరో 38 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నాం. ఒక్కో ప్యాకెట్లలో ఒక్కో గ్రాము కొకైన్ ఉంటుంది. పాతవారికి రూ.5 వేలు, కొత్తవారికి రూ.6 వేలకు విక్రయిస్తున్నాడు. మొత్తం రూ. 1.5 లక్షల విలువైన 56 గ్రాముల కొకైన్ స్వాధీం చేసుకున్నాం. మోరిస్ ఇచ్చిన సమాచారంతో మరో వ్యక్తిని పట్టుకున్నాం." -విజయ్, హైదరాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్

ఇవీ చదవండి: రేవంత్​ వ్యాఖ్యల దుమారం.. సొంత పార్టీ నేతలే ఖండిస్తోన్న వైనం!

కాంగ్రెస్​ కోసం 'టాస్క్​ఫోర్స్​'.. మూడు బృందాలతో ఎన్నికలకు రెడీ!

Last Updated : May 24, 2022, 9:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.