ETV Bharat / crime

బిడ్డను ఆ పరిస్థితిలో చూడలేక.. వదలిపోలేక

author img

By

Published : Apr 22, 2021, 8:51 PM IST

సృష్టిలో అమ్మ ప్రేమను మించింది ఏదీలేదు. తనకేదైనా తట్టుకుంటుంది గానీ.. తన బిడ్డకు ఏదైనా.. అయితే అస్సలు భరించలేదు. అలాంటి ఘటనే విశాఖ మన్యంలో జరిగింది. ఓ తల్లిశునకం.. తన బిడ్డ శునకానికైన ప్రమాదాన్ని చూసి తల్లడిల్లిపోయింది. వదల్లేక.. అక్కడే ఉండిపోయింది.

mother dog love at paderu
పాడేరులో కుక్క పిల్ల కోసం తల్లి ఆరాటం

విశాఖ జిల్లా పాడేరు గ్రంథాలయం రోడ్డుపై ఓ తల్లి శునకం నడుచుకుంటూ వెళ్తోంది. తన వెంటనే పిల్ల శునకం ఆడుకుంటూ నడుస్తోంది. అయితే హఠాత్తుగా ఓ వాహనం.. పిల్ల కుక్కను ఢీ కొట్టిడం వల్ల అక్కడకక్కడే చనిపోయింది. తన బిడ్డ.. వెనకే వస్తుందనుకున్న తల్లికి.. పిల్ల విగతజీవిగా ఉండిపోవడం చూసి తల్లడిల్లిపోయింది.

దగ్గరికి వెళ్తే అయిన వస్తుందేమోననుకున్నా నిరాశే ఎదురైంది. ఏం చేయాలో తెలియని తల్లి శునకం.. అటు.. ఇటు తిరగసాగింది. కోపంతో రోడ్డుపైన వెళుతున్న వాహనదారులను బెదిరించింది. ఈ దృశ్యాలను చూసిన స్థానికులు చలించిపోయారు.

బిడ్డను ఆ పరిస్థితిలో చూడలేక.. వదలిపోలేక

ఇవీచూడండి: భర్తపై అలిగి కుమార్తెతో సహా ఎస్సారెస్పీలో దూకిన మహిళ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.