ETV Bharat / city

మిర్చి సరికొత్త రికార్డ్.. ఆ రకం క్వింటాల్ ధర రూ.90,000

author img

By

Published : Sep 29, 2022, 2:56 PM IST

Updated : Sep 29, 2022, 3:05 PM IST

Mirchi
Mirchi

Mirchi Record Rate: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ మిర్చి రైతులపై కాసుల వర్షం కురిపిస్తోంది. కొన్నాళ్లుగా మిర్చి ధరలు పెరుగుతూ కనిపిస్తున్నా.. ఇవాళ మాత్రం కొత్తపుంతలు తొక్కింది. తాజాగా దేశీరకం మిర్చి... మార్కెట్ చరిత్రలోనే రికార్డు ధరను నమోదు చేసింది. క్వింటాల్ మిర్చి రూ.90 వేల ధర పలకడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Mirchi Record Rate: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మిర్చి ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా దేశీరకం మిర్చి... మార్కెట్ చరిత్రలోనే రికార్డు ధరను నమోదు చేసింది. క్వింటాల్ మిర్చి రూ.90 వేల ధర పలకడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే వండర్ హాట్ రకం 32వేల 500 గరిష్ట ధర నమోదు చేసింది. యూఎస్​ 341 రకం 27,500 పలికింది. తేజ రకం 22వేల రూపాయలకు చేరింది.

హనుమకొండ జిల్లా హైబత్‌పల్లికి చెందిన అశోక్ అనే రైతు గత ఏడాది సాగుచేసిన పంటకు సంతృప్తికరమైన ధర లేనందున శీతల గిడ్డంగిలో నిల్వ చేశాడు. గత కొన్ని రోజులుగా మిర్చికి పెరుగుతున్న ధరలతో మార్కెట్‌యార్డుకు తీసుకురాగా... 90వేల రికార్డు ధర నమోదు చేసింది. అంతర్జాతీయంగా మిర్చికి పెరుగుతున్న డిమాండ్‌తో ధరలు రికార్డు స్థాయిలో పలుకుతున్నట్లు మార్కెట్‌ అధికారులు చెబుతున్నారు.

దేశ చరిత్రలోనే మిర్చికి సరికొత్త రికార్డు ధరలు ఎనుమాముల మార్కెట్​లో నమోదు అవుతున్నాయి. గత ఏడాది సాగుచేసిన పంటకు సంతృప్తికరమైన ధర లేనందున కొందరు శీతల గిడ్డంగులలో నిల్వ చేసుకున్నారు. అలా నిల్వచేసిన పంటకు మంచి ధర లభిస్తుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రికార్డు ధర లభిస్తుండడం వల్ల అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మిర్చికి ఇంత ధర పలకడం ఇదే తొలిసారని చెబుతున్నారు.

మిర్చి సరికొత్త రికార్డ్.. ఆ రకం క్వింటాల్ ధర రూ.90,000

ఇవీ చదవండి:

Last Updated :Sep 29, 2022, 3:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.