ETV Bharat / city

ఏసీపీ చేతిలో బుక్కయిన ముగ్గురు కానిస్టేబుళ్లు.. అందరు చూస్తుండగా రోడ్డు మీదే..!

author img

By

Published : Mar 12, 2022, 8:34 PM IST

challan on three constables for not wearing helmet in hanmakonda
challan on three constables for not wearing helmet in hanmakonda

Challan on Constables: ట్రాఫిక్​ నిబంధనలు సామాన్య ప్రజలకేనా.. ? పోలీసులకు వర్తించవా..? అంటూ వాళ్లకు సంబంధించిన ఫొటోలు సోషల్​ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టటం చూస్తూనే ఉంటాం. పోలీసులైతే.. వాళ్లకు నిబంధనల నుంచి మినహాయింపేమీ ఉండదు.. కదా..? మరి వాళ్లను కూడా తనిఖీలు చేస్తారా..? నిబంధనలు పాటించకపోతే చలాన్లు వేసి.. వసూలు చేస్తారా..? అనే అనుమానాలు వస్తూనే ఉంటాయి. వాటన్నింటికీ తన చేతలతో సమాధానం చెప్పారు హన్మకొండ ట్రాఫిక్​ ఏసీపీ బాలస్వామి. ఎలానో మీరే చదవండి..

Challan on Constables: "ట్రాఫిక్​ నిబంధనలు పాటించండి.." అంటూ పోరు పెడుతున్న పోలీసులు.. పాటించకపోతే చలానాలు కూడా అదే రేంజ్​లో వసూలు చేస్తున్నారు. హెల్మెట్​ లేకపోయినా.. త్రిబుల్​ రైడింగ్​ చేసినా.. రాంగ్​రూట్​లో వెళ్తూ కనిపించినా.. ఇలా ఎలాంటి రూల్​ను బ్రేక్​ చేసినా.. ఫొటో కొడతారు.. చలానా వేస్తారు. మరి ఇదంతా కేవలం సామాన్య ప్రజలకేనా..? అంటే.. "అంత సీన్​ లేదు. ఎంతటి వారైనా.. నిబంధనలు పాటించాల్సిందే.." అంటున్నారు అధికారులు. ఒకవేళ పాటించకపోతే.. అందరిలాగానే జరిమానాలు చెల్లించాల్సిందేనని.. ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ఇలాంటి ఘటనే హన్మకొండలో జరిగింది.

హనుమకొండ జిల్లా అశోకజంక్షన్​లో ట్రాఫిక్ ఏసీపీ బాలాస్వామి ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేస్తున్నారు. అటుగా వెళ్తున్న వాహనాలు ఆపి.. పత్రాలు సరిగ్గా ఉన్నాయా లేదా..? పెండింగ్​ చలానాలు ఏమైనా ఉన్నాయా..? అని ఆరా తీస్తున్నారు. జరిమానాలేమైనా ఉంటే.. అక్కడే కట్టించుకుంటున్నారు. అదే సమయంలో.. విధులు ముగించుకుని ముగ్గురు కానిస్టేబుళ్లు తమతమ ద్విచక్రవాహనాలపై ఇంటికి వెళ్తున్నారు. వాళ్లను గమించిన ట్రాఫిక్​ ఏపీసీ బాలాస్వామి.. ముగ్గురిని ఆపారు.

challan on three constables for not wearing helmet in hanmakonda
ఏసీపీ చేతిలో బుక్కయిన ముగ్గురు కానిస్టేబుళ్లు

ఆ ముగ్గురు కానిస్టేబుళ్లు యూనిఫాంలోనే ఉన్నారు.. బైకుల మీద పోలీస్​ అని కూడా రాసుంది.. అయినా ఎందుకు ఆపారంటే.. ముగ్గురూ హెల్మెట్లు ధరించలేదు. అక్కడే.. ట్రాఫిక్​ ఏసీపీ చేతిలో బుక్కయ్యారు. "మేము కూడా డిపార్ట్​మెంటే అంటే కుదరదు.. మీరు కూడా రూల్స్​ పాటించాల్సిందే.. అసలు మీరు రూల్స్​ పాటిస్తూ.. మిగతా వాళ్లకు చెప్పాల్సింది పోయి ఇలా చేస్తే ఎలా..?" అని హెచ్చరించారు. హెల్మెట్​ లేకుండా ద్విచక్రవాహనం నడుపుతున్నందుకు గానూ.. ఆ ముగ్గురు కానిస్టేబుళ్లపై చలానా వేశారు. అక్కడిక్కడే జరిమానా రుసుమును కూడా వసూలు చేశారు.

ట్రాఫిక్ నిబంధనలను ఎంతటి వారైనా తప్పనిసరిగా పాటించాలని.. ఎవరికీ మినహాయింపు లేదని ఈ చర్యతో ఏసీపీ నిరూపించారు. పోలీసులు కానీ.. వాళ్ల ఎంత పెద్దవాళ్లైనా సరే.. నిబంధనలు అతిక్రమిస్తే అందరిలాగే వాళ్లపై కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఏసీపీ బాలాస్వామి తెలిపారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.