ETV Bharat / city

RS PRAVEEN KUMAR: నల్గొండ సభలో బీఎస్పీలో చేరిన ఆర్​ఎస్​ ప్రవీణ్‌కుమార్‌

author img

By

Published : Aug 8, 2021, 8:07 PM IST

Updated : Aug 8, 2021, 9:32 PM IST

RS PRAVEEN KUMAR
RS PRAVEEN KUMAR

ఇటీవలే స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసిన ఐపీఎస్​ అధికారి ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​.. రాజకీయాల్లోకి ప్రవేశించారు. బహుజన సమాజ్​ పార్టీ(బీఎస్పీ) కండువా కప్పుకున్నారు. నల్గొండ ఎన్‌జీ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన 'రాజ్యాధికార సంకల్ప సభ'లో బీఎస్పీలో చేరారు. ఐపీఎస్​కు రాజీనామా అనంతరం.. పూలే, అంబేడ్కర్, కాన్షీరాం బాటలోనే పోరాటం చేస్తానని ఆయన ఇదివరకే స్పష్టం చేశారు.

మాజీ ఐపీఎస్​ ఆర్​ఎస్​ ప్రవీణ్‌కుమార్‌ బీఎస్పీలో చేరారు. నల్గొండ ఎన్‌జీ కళాశాల మైదానంలో నిర్వహించిన 'రాజ్యాధికార సంకల్ప సభ'లో బీఎస్పీ జాతీయ కోఆర్డినేటర్​, రాజ్యసభ సభ్యుడు రాంజీ గౌతమ్... ఆర్​ఎస్​ ప్రవీణ్‌కుమార్​ను పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ కండువా కప్పి... సభ్యత్వం అందజేశారు. ప్రవీణ్ కుమార్‌ను బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్‌గా ప్రకటించారు.

rs praveen kumar bsp joining
ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న బీఎస్పీ ఎంపీ రాంజీ గౌతమ్

మర్రిగూడ బైపాస్‌ వద్ద అంబేడ్కర్‌, జగ్జీవన్‌ విగ్రహాలకు ఆర్ఎస్​ ప్రవీణ్​ కుమార్​ నివాళులు అర్పించారు. అనంతరం ర్యాలీగా బయల్దేరి సభాస్థలికి చేరుకున్నారు. స్వేరో ప్రతినిధులు, బీఎస్పీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు.

rs praveen kumar bsp joining
తనకు బహుకరించిన ఖడ్గంతో ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్

ఇదీచూడండి: RS PRAVEEN KUMAR: నేను హిందువునే... మాతమార్పిడులు అవాస్తవం... అందుకే రాజీనామా చేశా?

Last Updated :Aug 8, 2021, 9:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.