ETV Bharat / city

Bike stunts in Hyderabad : అర్ధరాత్రి సమయంలో యువకుల బైక్ స్టంట్లు.. వాహనదారులు హడల్

author img

By

Published : Oct 12, 2021, 11:27 AM IST

Updated : Oct 12, 2021, 12:29 PM IST

బైక్ అంటే ఇష్టపడని యువకులుండరు. బైక్​ ఉంటే అదో ప్రెస్టీషియస్​గా ఫీలవుతారు. దాంతో స్టంట్లు(Bike stunts in Hyderabad) చేస్తూ అదో ట్రెండ్​లా భావిస్తుంటారు. స్టంట్లు చేసే క్రమంలో కిందపడతామన్న భయం.. చేస్తున్నప్పుడు ఎదురుగా వచ్చే వాహనదారులు ఇబ్బందులు పడతారన్నది గమనించరు. స్టంట్ చేసేటప్పుడు కొంచెం గాడి తప్పిందా.. ప్రాణం గోవిందా...

Bike stunts in secunderabad
Bike stunts in secunderabad

అర్ధరాత్రి సమయంలో యువకుల బైక్ స్టంట్లు

హైదరాబాద్​లోని లంగర్​హౌస్ పోలీస్ స్టేషన్​ పరిధిలో అర్ధరాత్రి వేళల్లో కొంత మంది యువకులు వికృత చేష్టలు చేస్తున్నారు. బైక్​లపై స్టంట్లు(Bike stunts in Hyderabad) చేస్తూ వాహనదారులను భయపెడుతున్నారు. ఇష్టారీతిన బైక్ డ్రైవ్ చేస్తూ ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. స్టంట్లు చేసేటప్పుడు ఫోన్​లో చిత్రీకరిస్తూ నిర్లక్ష్యం వహిస్తున్నారు.

సోమవారం అర్ధరాత్రి.. ఫ్లోర్ మిల్ నుంచి లంగర్​హౌస్ వెళ్లే దారిలో యువకులు బైక్​పై వెళ్తూ విన్యాసాలు చేశారు. ఎదురుగా వచ్చే వాహనదారులను భయపెడుతూ ఇబ్బందులకు గురి చేశారు. ఈ చేష్టలను మరో ద్విచక్రవాహనంపై వెళ్తున్న యువకులు ఫోన్​లో చిత్రీకరించారు. బైక్​పై ఇద్దరు యువకులు కూర్చొని వాహనం ముందు భాగాన్ని ప్రమాదకరంగా గాల్లో లేపి స్టంట్లు(Bike stunts in Hyderabad) చేశారు. బండి కాస్త గాడి తప్పినా.. ప్రాణాలు పోయేవి. ఇప్పటికే ప్రతిరోజు నగరంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఎంతో మంది యువత ప్రాణాలు కోల్పోతున్నారు.

బైక్​లపై స్టంట్లు చేస్తూ వారి ప్రాణాలకు ప్రమాదకరంగా ప్రవర్తించడమే గాక.. ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్నారు. ఇలాంటి వారిపై ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. అర్ధరాత్రి వేళలో పెట్రోలింగ్ చేస్తూ వారి ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.

Last Updated : Oct 12, 2021, 12:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.