ETV Bharat / city

చనిపోయిన వ్యక్తికీ 'సంక్షేమ బావుటా'.. మూడేళ్లుగా పింఛను, రైతు భరోసా!

author img

By

Published : Aug 4, 2022, 2:17 PM IST

ఆయనో రైతు.. తొమ్మిదేళ్ల కిందట మృతి చెందారు.. అయినా ఆయనకు మూడేళ్లుగా పింఛను, రైతు భరోసా సొమ్ము అందజేస్తున్నట్లు అధికారులు వెల్లడించడంతో కుటుంబసభ్యులు అవాక్కయ్యారు. ఈ ఘటన ఏపీలోని కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం గురజాడలో చోటుచేసుకుంది.

చనిపోయిన వ్యక్తికీ 'సంక్షేమ బావుటా'.. మూడేళ్లుగా పింఛను, రైతు భరోసా!
చనిపోయిన వ్యక్తికీ 'సంక్షేమ బావుటా'.. మూడేళ్లుగా పింఛను, రైతు భరోసా!

ఆంధ్రప్రదేశ్​లోని కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం గురజాడకు చెందిన రాజులపాటి సత్యనారాయణ 2013లో మృతి చెందారు. ఆయనకు గత మూడేళ్లుగా వైఎస్‌ఆర్‌ పింఛను కానుక కింద రూ.33,500.. వైఎస్‌ఆర్‌ రైతు భరోసా కింద రూ.34,500 ఇచ్చినట్లు.. 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు 'సంక్షేమ బావుటా' పత్రాన్ని అందజేశారు.

...

దీనికి ఆశ్చర్యపోయిన సత్యనారాయణ కుమారుడు జగదీశ్‌ ఆ సొమ్ము ఎవరు తీసుకున్నారో బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. స్థానిక వాలంటీరును ప్రశ్నించగా.. అదే పేరుతో మరో వ్యక్తి ఇంకో వార్డులో ఉండి ఉంటారని తెలిపినట్లు జగదీశ్‌ పేర్కొన్నారు. దీనిపై ఎంపీడీవో ఏవీ నాంచారరావును 'ఈనాడు-ఈటీవీ భారత్' వివరణ కోరగా ఈ విషయం ఇప్పుడే తమ దృష్టికి వచ్చిందని, విచారణ జరుపుతామని తెలిపారు.

ఇవీ చూడండి :

రాష్ట్రంలో ఇంకా చాలా ఉప ఎన్నికలు రాబోతున్నాయి: బండి సంజయ్​

రూ.619 పెట్టుబడికి రూ.2లక్షల లాభం.. ఈ షేరు ఐపీఓ సూపర్​హిట్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.