ETV Bharat / city

TTD: 'గోవిందానంద సరస్వతికి సంస్కృతంలో పరిజ్ఞానమే లేదు'

author img

By

Published : May 27, 2021, 10:36 PM IST

అంజనాద్రే ఆంజనేయుడి(anjanadri) జన్మస్థలమన్న తితిదే(TTD) ప్రకటనను విభేదిస్తూ పంపా క్షేత్ర కిష్కింధ ట్రస్ట్.. తితిదే(TTD) పండిత కమిటీతో జరిపిన భేటీ అసంపూర్తిగా ముగిసింది. తితిదే పండిత కమిటీ తీసుకున్న నిర్ణయం కేవలం అధికారులు తీసుకున్నదిగా భావిస్తామన్న హనుమద్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఫౌండర్ ట్రస్టీ గోవిందానంద సరస్వతి... ఈ నిర్ణయం తీసుకునే అధికారం తిరుమల పెద్దజీయర్ స్వామికి మాత్రమే ఉందన్నారు. అటు గోవిందానంద తీరును తిరుమల తిరుపతి దేవస్థానం పండితులు తప్పుపట్టారు. పామరులు కూడా అసహ్యించుకునేలా గోవిందానంద లేఖలున్నాయని, ఆయనకు సంస్కృత పరిజ్ఞానమే లేదని మండిపడ్డారు.

ttd
తితిదే పండిత కమిటీ తాజా వార్తలు

పంపాక్షేత్ర కిష్కింధ ట్రస్ట్.. తితిదే(TTD) పండిత కమిటీతో జరిపిన భేటీ అసంపూర్తిగా ముగిసింది. ఈ భేటీ తర్వాత హనుమద్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఫౌండర్ ట్రస్టీ గోవిందానంద సరస్వతి మీడియాతో మాట్లాడారు. దీనిపై తితిదే(TTD) పండిత కమిటీ సభ్యులు ఘాటుగా స్పందించారు. గోవిందానంద రాసిన లేఖలను చదివి వినిపించారు.

తితిదే వేద అధ్యయన సంస్థ ఆధ్వర్యంలో పరిశోధన జరిపాం. శ్రీరామనవమి రోజు మీడియా ఎదుటే నిర్ణయం ప్రకటించాం. గోవిందానంద అభ్యంతరం వ్యక్తం చేస్తూ లేఖలు రాశారు. గోవిందానంద లేఖల్లోని భాషను కూడా గమనించాలి.

- విభీషణ శర్మ, తితిదే(TTD) కమిటీ సభ్యులు

పామరులు కూడా అసహ్యించుకునేలా గోవిందానంద లేఖలున్నాయని తితిదే(TTD) కమిటీ సభ్యులు రామకృష్ణ వ్యాఖ్యానించారు. సన్యాసిగా ఉండి లేఖల్లో ఇలాంటి భాష ఎలా రాస్తారు? అని ప్రశ్నించారు. అమాయక భక్తులను వంచిస్తున్నామని లేఖలో రాశారన్న రామకృష్ణ... బాహుబలిలా ఒక్కడినే వస్తానని గోవిందానంద తెలిపారన్నారు.

లేఖలోని పదాలకు అర్థం చెప్పమంటే మౌనం వహించారని రామకృష్ణ వెల్లడించారు. దర్శనానికి వచ్చి సుందరకాండ పారాయణంలో పాల్గొన్నారని తెలిపారు. గోవిందానంద సరస్వతికి సంస్కృతంలో పరిజ్ఞానమే లేదన్న రామకృష్ణ... తాము సంస్కృత శ్లోకాలు చెబుతుంటే గోవిందానంద మౌనం దాల్చారని చెప్పారు.

ఇవీచూడండి: Hanuman birth place: అసంపూర్తిగా ముగిసిన హనుమాన్‌ జన్మస్థలంపై చర్చ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.