ETV Bharat / city

Train ticket price hike : రైలు ప్రయాణికులపై పెరగనున్న ఛార్జీల భారం

author img

By

Published : Sep 30, 2021, 10:17 AM IST

దక్షిణ మధ్య రైల్వే తాజాగా తీసుకొచ్చిన కొన్ని మార్పులతో టికెట్ ఛార్జీలు(Train ticket price hike) పెరగనున్నాయి. ఆరు ఎక్స్​ప్రెస్ రైళ్లును సూపర్ ఫాస్ట్​గా.. 22 ప్యాసింజర్ రైళ్లను ఎక్స్​ప్రెస్​లుగా మారుస్తున్నట్లు ప్రకటించింది. ఈ మార్పు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపింది.

Train ticket price hike
Train ticket price hike

ఆరు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను సూపర్‌ఫాస్ట్‌గా మారుస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. 22 ప్యాసింజర్‌ రైళ్లను ఎక్స్‌ప్రెస్‌లుగా మారుస్తున్నట్లు పేర్కొంది. అక్టోబరు 1 నుంచి ఈ మార్పు అమల్లోకి రానుంది. ఈ రైళ్లకు కొత్త నంబర్లను రైల్వేశాఖ కేటాయించింది. కొన్ని రైళ్లకు ప్రయాణమార్గాలను కూడా మార్చింది. తాజా మార్పులతో రైలు ప్రయాణికులకు టికెట్ల రూపంలో ఛార్జీల(Train ticket price hike) భారం పెరగనుంది.

సూపర్‌ఫాస్ట్‌గా మార్చినవి

సికింద్రాబాద్‌-మణుగూర్‌ ఎక్స్‌ప్రెస్‌, నర్సాపూర్‌-నాగర్‌సోల్‌, కాచిగూడ-మంగళూరు సెంట్రల్‌, సికింద్రాబాద్‌-రాజ్‌కోట్‌, కాకినాడటౌన్‌-భువనేశ్వర్‌, సికింద్రాబాద్‌-హిస్సార్‌

ఎక్స్‌ప్రెస్‌లుగా మారినవి..

కాజీపేట-సిర్పూర్‌ టౌన్‌, సిర్పూర్‌టౌన్‌-కాజీపేట, సిర్పూర్‌ టౌన్‌-భద్రాచలంరోడ్‌, భద్రాచలం రోడ్‌-సిర్పూర్‌ టౌన్‌, గుంటూరు-నర్సాపూర్‌, నర్సాపూర్‌-గుంటూరు, హైదరాబాద్‌ దక్కన్‌-పూర్ణ, పూర్ణ-హైదరాబాద్‌ దక్కన్‌, హైదరాబాద్‌ దక్కన్‌-ఔరంగాబాద్‌, ఔరంగాబాద్‌-హైదరాబాద్‌ దక్కన్‌, నాందేడ్‌-తాండూర్‌, తాండూర్‌-పర్బని, విజయవాడ-కాకినాడ పోర్టు, కాకినాడపోర్టు-విజయవాడ, విశాఖపట్నం-కాకినాడ పోర్టు, కాకినాడ పోర్టు-విశాఖపట్నం, గూడూరు-విజయవాడ, విజయవాడ-గూడూరు, గుంటూరు-కాచిగూడ, కాచిగూడ-గుంటూరు, రాయచూరు-కాచిగూడ, కాచిగూడ-రాయచూరు.

ఆ రైళ్లు ఇక ఈ రూట్లలో ప్రయాణం

సికింద్రాబాద్‌-గువాహటి-సికింద్రాబాద్‌ వీక్లీ రైళ్లు (నెం.02513/02514) ప్రస్తుతం కాజీపేట, విజయవాడ, దువ్వాడ మార్గంలో ప్రయాణిస్తుండగా, ఇక పగిడిపల్లి, నల్గొండ, విజయవాడ మార్గంలో రాకపోకలు సాగించనున్నాయి. వారానికి రెండ్రోజులు నడిచే సికింద్రాబాద్‌-విశాఖపట్నం-సికింద్రాబాద్‌ రైళ్లు (02203/02204)కాజీపేట, విజయవాడ మార్గంలో బదులుగా పగిడిపల్లి, నల్గొండ, విజయవాడ మార్గంలో.. సికింద్రాబాద్‌-విశాఖట్నం-సికింద్రాబాద్‌ వీక్లీ (02784/02783)కాజీపేట బదులుగా పగిడిపల్లి, నల్గొండ మీదుగా.. కాచిగూడ-విశాఖపట్నం-కాచిగూడ (08562/08561) డైలీ ఎక్స్‌ప్రెస్‌ కాజీపేట, విజయవాడకు బదులుగా కాజీపేట-రాయనపాడు మీదుగా వెళుతుంది. విజయవాడలో ఈ రైలు ఆగదు. మొత్తం 872 రైళ్లలో 673 రైళ్ల వేగం పెంచినట్లు రైల్వేశాఖ తెలిపింది. పలు రైళ్ల టెర్మినల్‌ స్థానాల్ని మార్చింది. తిరుపతి-గూడూరును తిరుపతి-రేణిగుంట, గూడూరు-తిరుపతిని రేణిగుంట-తిరుపతి మధ్య, సికింద్రాబాద్‌-హుబ్బళ్లి రైలును సికింద్రాబాద్‌-హైదరాబాద్‌ మధ్య, కాజీపేట-బల్లార్ష రైలును బలార్ష-సిర్పూర్‌టౌన్‌ మధ్య, బల్లార్ష-భద్రాచలం రైలును బల్లార్ష-సిర్పూర్‌ మధ్య రద్దు చేస్తున్నట్లు ద.మ.రైల్వే తెలిపింది.

రైళ్ల రాకపోకలకు కొత్త కాలపట్టిక

  • రైళ్ల రాకపోకల వేళల్లో మార్పులు చేర్పులు జరిగాయి. కొత్త కాలపట్టిక (టైంటేబుల్‌) అక్టోబరు 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని దక్షిణ మధ్య రైల్వే బుధవారం ప్రకటించింది. పాత సమయాలతో పోలిస్తే రైళ్లు సగటున 10, 15 నిమిషాల ముందు, లేదా తర్వాత బయల్దేరనున్నాయి. ఆయా స్టేషన్లకు చేరుకునే సమయాల్లోనూ ఇంచుమించుగా ఇంతే మార్పులు చేర్పులు జరిగాయి. సికింద్రాబాద్‌ స్టేషన్‌లో 43 రైళ్లు, హైదరాబాద్‌ నుంచి 6, కాచిగూడ నుంచి 28, విజయవాడ స్టేషన్‌లో 161, తిరుపతిలో 11, నాందేడ్‌లో 16, గుంటూరు స్టేషన్‌లో 25 రైళ్ల రాకపోకల వేళలు మారాయి.
  • హైదరాబాద్‌-జైపుర్‌ (02720)రైలు రాత్రి 9 గంటలకు బదులుగా 5 నిమిషాల ముందుగా 8.55కి బయల్దేరుతుంది. మరుసటిరోజు రాత్రి 8.52కి బదులుగా 8.47కి గమ్యస్థానం చేరుతుంది.
  • తిరుపతి-జమ్మూతావి (నెం.02277)సాయంత్రం 5.55కి బదులుగా 15 నిమిషాలు ఆలస్యంగా 6.10కి బయల్దేరుతుంది.

ఇదీ చదవండి : DSP transfer : రాష్ట్రంలో 20 మంది డీఎస్పీల బదిలీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.