ETV Bharat / state

ఆరుపదుల దాంపత్యానికి అక్షరరూపం 'అనురాగదీపం' - కన్నీళ్లతో అర్ధాంగికి అంపశయ్య నవీన్ అక్షరనివాళి - Ampasayya Naveen Anuraga Deepam

author img

By ETV Bharat Telangana Team

Published : May 27, 2024, 12:13 PM IST

Ampasayya Naveen Novel Anuraga Deepam :మనిషి జీవితంలో ఎంతమంది తోడు ఉన్నా చివరి శ్వాసవరకు తోడుండేది జీవిత భాగస్వామే! తల్లిదండ్రులు, తోబుట్టువులు వివాహం వరకు తోడుంటారు. పిల్లలు వారి కాళ్లమీద వాళ్లు నిలబడేంత వరకు దగ్గర ఉంటారు. కానీ అగ్ని సాక్షిగా వివాహం ఆడిన భార్యాభర్తలు తనువులు రెండు ప్రాణం ఒటిగా బతుకుతారు. కానీ అందులో ఏ ఒక్కరు కాలం చెల్లిపోయినా మిగితవారి జీవితం శూన్యంలా కనిపిస్తుంది. అలా తన అర్ధాంగిని కోల్పోయిన ప్రముఖ రచయిత అంపశయ్య నవీన్ వారి దాంపత్యానికి అక్షర రూపం ఇచ్చి తన భార్యపై ప్రేమచాటుకున్నారు.

Ampasayya Naveen On Anuraga Deepam Novel
Ampasayya Naveen Novel (ETV Bharat)

60 ఏళ్ల దాంపత్యానికి అక్షర రూపం - మరణించిన తన భార్య గుర్తుగా నవల రాసిన అంపశయ్య నవీన్ (ETV Bharat)

Ampasayya Naveen On Anuraga Deepam Novel :ప్రముఖ రచయిత అంపశయ్య నవీన్ గురించి సాహితీలోకంలో తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. 1969లో ఆయన రాసిన తొలి నవల అంపశయ్య సాహితీ లోంకలోకి అక్షర క్షిపణిలా దూసుకుపోయింది. మొదటి నవలే ఇంటి పేరుగా స్థిరపడిపోయిందంటే ఆ నవల గొప్పతనం మనం అర్థం చేసుకోవచ్చు. గతేడాది ఆయన జీవిత భాగస్వామి అనసూయ అనారోగ్యంతో కన్నుమూశారు. తన కష్ట సుఖాల్లో పాలుపంచుకున్న అర్ధాంగి అర్ధాంతరంగా తనను విడిచి వెళ్లిపోవడం ఆయన జీర్ణించుకోలేకపోయారు. తన భాగస్వామి 60 ఏళ్ల జ్ఞాపకాలను నెమరేసుకుంటూ "అనురాగ దీపం" అనే నవలను రాశారు.

Anuraga Deepam Novel : తన భాగస్వామిని కోల్పోయిన బాధ నుంచి బయటకు రావడానికి ఈ నవలకు శ్రీకారం చుట్టాను అంటున్నారు నవీన్‌. భార్యతో గడిపిన మధురక్షణాలను నెమరవేసుకుంటూ నవల రాశానన్నారు. భౌతికంగా ఆమె దూరం అయినప్పటికీ నవల రాస్తున్న సమయంలో తన పక్కనే ఉన్న భావనకు లోనయ్యానంటున్నారు నవీన్‌. జీవితానికి వెలుగులు ఇచ్చి, కష్టసుఖాల్లో పాలు పంచుకుని జీవితాంతం అనురాగాన్ని పంచినందుకు ఈ నవలకు అనురాగ దీపం పేరు పెట్టినట్లు నవీన్‌ స్పష్టం చేశారు.

సాహిత్యంలో చిచ్చరపిడుగు- చిన్నవయసులోనే 4 పుస్తకాలు రాసిన అమ్మాయి

ఎన్నో నవల కథలు రాసినా ఇవ్వని సంతృప్తి ఈ నవల ఇచ్చిందన్న నవీన్‌ సిరాతో కాకుండా కన్నీళ్లతో రాశానన్నారు. అరమరికలు లేని భార్యభర్తల బంధం సంసారం గురించి ఈ తరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన చెపుతున్నారు. సామాజిక సమస్యలను స్పృశిస్తూ అంపశయ్య నవీన్ పదుల సంఖ్యలో నవలలు, కథలు రాసి ఎన్నో పురస్కారాలు పొందారు. తెలుగు సాహిత్యంలో అంపశయ్య నవల ఓ ఆణిముత్యంగా నిలిచింది. 2004లో కాలరేఖలు అనే నవలకు కేంద్ర సాహిత్య అకాడమి పురస్కారాన్ని నవీన్ అందుకున్నారు. భార్యాభర్తల పవిత్రమైన బంధం గురించి తమ దాంపత్య జీవితాన్ని నవలగా మలిచి నేటి తరానికి అందించారు అంపశయ్య నవీన్‌.

అరవై సంవత్సరాలుగా నాతో కలిసి జీవించిన నా భార్య చనిపోవడం జీర్ణించుకోలేక పోయాను. నా భాగస్వామిని కోల్పోయిన బాధ నుంచి బయటకు రావడానికి ఈ నవల రాశాను. భార్యతో గడిపిన మధురక్షణాలను నెమరవేసుకుంటూ రాశాను. జీవితానికి వెలుగులు ఇచ్చి, కష్టసుఖాల్లో పాలు పంచుకుని జీవితాంతం అనురాగాన్ని పంచినందుకు ఈ నవలకు అనురాగ దీపం పేరు పెట్టాను. సిరాతో కాకుండా కన్నీళ్లతో ఈ నవల రాశాను. -అంపశయ్య నవీన్, రచయిత

Nobel Prize In Literature 2023 : నార్వే రచయితకు సాహిత్యంలో నోబెల్ పురస్కారం

Hyderabad Student Akarshana Interview : ఆకర్షణ ది లైబ్రరీ గర్ల్‌.. అబ్దుల్‌ కలం స్ఫూర్తిగా ఆకర్షణ అడుగులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.