Telangana Top News: టాప్‌ న్యూస్ @3PM

author img

By

Published : Aug 3, 2022, 2:58 PM IST

Updated : Aug 3, 2022, 3:29 PM IST

3PM TOPNEWS

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

  • చెరో దారిలో కోమటిరెడ్డి బ్రదర్స్...

నల్గొండ రాజకీయాల్లో రామలక్ష్మణుల్లా ఉన్న కోమటి రెడ్డి బ్రదర్స్ ...దారులు మారాయి. ఇంతకాలం ఒకే పార్టీలో ఉంటూ నల్గొండ కాంగ్రెస్‌లో కింగ్‌మేకర్స్‌గా ఉన్న సోదరులు రాజకీయ ప్రత్యర్థులయ్యారు. గత కొన్నాళ్లుగా పతాక శీర్షికల్లో నానుతున్న మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి తన పదవీకి రాజీనామా చేయడంతో ఉమ్మడి జిల్లాలో రాజకీయ వేడి మొదలైంది.

  • 'ఏపీ సీఎం జగన్‌తో నాకు పరిచయం లేదు'

ఏపీ సీఎంతో తనకు సంబంధాలున్నట్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేస్తున్నారని చీకోటి ప్రవీణ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీని వెనుక ఏపీ ప్రతిపక్ష నాయకులు ఉన్నట్లు అనుమానంగా ఉందని ఆరోపించాడు.

  • 'రేవంత్‌రెడ్డి ఓ బ్లాక్‌మెయిలర్'

కేసీఆర్‌ మంత్రి పదవి ఇస్తానన్నా, కాంట్రాక్టులు రద్దు చేసినా లొంగని వ్యక్తి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అని... అలాంటి నాయకుడి పట్ల రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు.

  • అశ్రునయనాల మధ్య ఎన్టీఆర్ కూతురి అంత్యక్రియలు..

నందమూరి తారకరామారావు కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి అంత్యక్రియలు ముగిశాయి. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ఉమామహేశ్వరి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కుటుంబసభ్యులు, బంధువులు తరలి వచ్చి తుది వీడ్కోలు పలికారు.

  • వాంతులు, విరేచనాలతో జనం బెంబేలు..

రాష్ట్రంలో డయేరియా, గ్యాస్ట్రోఎంటరైటిస్‌ విజృంభిస్తున్నాయి. కలుషిత నీరు, ఆహారాన్ని తినడంతో వాంతులు, విరేచనాలతో జనం బెంబేలెత్తుతున్నారు. గత 7 నెలల్లో 1.43 లక్షల కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా హైదరాబాద్‌లో 20,629 కేసులు గుర్తించారు.

  • ఇన్‌స్టాలో గ్యాంగ్‌ రేప్ బాధితురాలి వీడియోలు..

తమ కుమార్తెపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులు ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని జూబ్లీహిల్స్ మైనర్ అత్యాచార బాధితురాలి తల్లిదండ్రులు తెలిపారు.

  • తల్లి మృతదేహం పక్కనే చిన్నారి నిద్ర..

కన్నతల్లి చనిపోయిందని తెలియని ఓ బాలుడు.. ఆమె పక్కనే సుమారు ఐదు గంటలసేపు పడుకున్నాడు. 'అమ్మా ఆకలేస్తోంది.. లే' అని పిలుస్తూ తల్లి మృతదేహం పక్కనే కూర్చున్నాడు. ఈ హృదాయవిదారక ఘటన బిహార్​లో వెలుగు చూసింది.

  • ఐసీయూలో రోగికి 'భూతవైద్యుడి' ట్రీట్​మెంట్​..

పాము కాటుకు గురైన ఓ మహిళకు ఆమె కుటుంబసభ్యులు.. ఆసుపత్రి ఐసీయూలోనే భూతవైద్యం చేయించారు. ఆ సమయంలో.. డాక్టర్లంతా అక్కడే ఉన్నా కనీసం అడ్డుకోలేదు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

  • 'మంకీపాక్స్ విషయంలో అలా చేయొద్దు'..

దేశంలో మంకీపాక్స్‌ కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఎనిమిది మంది ఈ వ్యాధి బారినపడగా.. ఒకరు మరణించారు. ఈ నేపథ్యంలో తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది కేంద్రం. మంకీపాక్స్​ వ్యాప్తి నివారణకు ఏం చేయాలో, బాధితులతో ఎలా ఉండాలో వివరించింది.

  • విశాఖకు 12 అంతస్తుల అమెరికా నౌక..

జలాంతర్గాములకు వెన్నుదన్నుగా నిలిచేలా సమగ్ర వసతులున్న యుద్ధనౌక ‘ఫ్రాంక్‌ కేబుల్‌’ మంగళవారం విశాఖ నౌకాశ్రయానికి చేరుకుంది. ఎల్‌.ఐ.స్పియర్‌ శ్రేణికి చెందిన దీనిని 1979లో అమెరికా నౌకాదళంలో ప్రవేశపెట్టినప్పటికీ ఎప్పటికప్పుడు ఆధునికీకరిస్తూ అత్యాధునికంగా తీర్చిదిద్దారు.

Last Updated :Aug 3, 2022, 3:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.