ETV Bharat / city

TOP NEWS: టాప్ న్యూస్ @ 7PM

author img

By

Published : Jun 15, 2022, 7:02 PM IST

Top news
top news in telangana

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

  • రాష్ట్రపతి అభ్యర్థిని నిలబెడతారా?

పీఎం మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్​పై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రపతి ఎన్నికల్లో భాజపాకు కేసీఆర్‌ పరోక్షంగా సహకరిస్తారని ఆరోపించారు. భాజపాకు కేసీఆర్‌ వ్యతిరేకమైతే రాష్ట్రపతి అభ్యర్థిని నిలబెడతారా? అని ప్రశ్నించారు.

  • 'ముందు ఫోన్లు బంజేయుండ్రి'

KTR Inspiring Words: మూడు నెలలు కష్టపడి చదివితే ప్రభుత్వ ఉద్యోగం సాధించడం అంత కష్టమేమి కాదని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సెల్​ఫోన్లను పక్కకు పెట్టి శ్రద్ధగా చదవాలని నిరుద్యోగుల్లో స్ఫూర్తిని నింపారు. టాలెంట్​ ఉన్న వ్యక్తికి అవకాశాలకు కొదవలేదని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగం రాకపోయినా... చింతించ్చవద్దన్న ఆయన... ప్రైవేటులోనూ విస్తారంగా అవకాశాలున్నాయని తెలిపారు.

  • విద్యార్థులతో చర్చలు విఫలం

నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీ విద్యార్థులతో కలెక్టర్‌ చర్చలు విఫలమయ్యాయి. విద్యార్థి నాయకులతో కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ చర్చించారు. కలెక్టర్‌ ముందు ఆర్జీయూకేటీ విద్యార్థులు 12 డిమాండ్లను ఉంచారు

  • హరీశ్‌తో భూనిర్వాసితులు, కాంగ్రెస్‌ నేతల భేటీ

మంత్రి హరీశ్‌రావుతో భూనిర్వాసితులు, కాంగ్రెస్‌ నేతల భేటీ అయ్యారు. గంటపాటు చర్చలు జరిగాయి. భూనిర్వాసితులు సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అయితే ముందుగా గ్రామాన్ని ఖాళీ చేయాలని మంత్రి తమకు సూచించినట్లు నిర్వాసితులు తెలిపారు. కాంగ్రెస్ నేతలు మాత్రం సమస్య పరిష్కారమయ్యే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

  • కుమార్తె నోట్లో కుంకుమ పోసి..

ఆంధ్రప్రదేశ్‌ నెల్లూరులో దారుణం చోటుచేసుకుంది. కుమార్తె నోట్లో కుంకుమ పోసి.. అనంతరం గొంతు నులిమి చంపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

  • పవార్​ను ఒప్పించటంలో విఫలం!

రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని బరిలో నిలపాలని తీర్మానించాయి 17 పార్టీలు. అయితే, ఎన్​సీపీ అధినేత శరద్​ పవార్​ ఒప్పించటంలో విఫలమయ్యాయి. ఈ క్రమంలో మరో ఇద్దరు నేతల పేర్లు తెరపైకి వచ్చాయి. మరోవైపు.. ఈ ఎన్నికలను ఏకగ్రీవం చేసేందుకు భాజపా పావులు కదుపుతోంది.

  • ఉమ్మడి అభ్యర్థితో రాష్ట్రపతి ఎన్నికల బరిలోకి

రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని బరిలో నిలపాలని 17 పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఈ మేరకు ఎన్​డీఏపై పోటీలో ఉమ్మడి అభ్యర్థిని నిలిపేందుకు తీర్మానించాయి. అయితే, మొదటి నుంచి అనుకుంటున్నట్లు ఎన్​సీపీ అధినేత శరద్​ పవార్​ను ఒప్పించటంలో విఫలమయ్యాయి.

  • పెట్రోల్​, డీజిల్ స్టాక్ నిల్​

Petrol Diesel Crisis in Rajasthan: రాజస్థాన్​లో పెట్రోల్​, డీజిల్​ కొరత ఏర్పడింది. బీసీసీఎల్, హెచ్​పీసీఎల్​లో స్టాక్ లేకపోవడం వల్ల జైపుర్​లో ఐఓసీఎల్​ బంకుల ముందు జనం బారులు తీరారు. ఇంధనం కోసం గంటల కొద్ది క్యూలో నిల్చున్నారు. వాహనదారులు భారీ సంఖ్యలో ఉండటం వల్ల పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేశారు.

  • 'వాళ్లకు కరోనా వస్తే నన్నెందుకు నిందిస్తారు?'

ఇటీవల షారుక్, కత్రినా సహా పలువురు ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. అయితే ఇందుకు కరణ్​ జోహార్​ ఇచ్చిన పార్టీనే కారణమని విమర్శలు వచ్చాయి. తాజాగా దీనిపై స్పందించిన కరణ్​.. వాళ్లకు వైరస్​ సోకితే తనను ఎందుకు నిందిస్తున్నారని ప్రశ్నించాడు.

  • రోహిత్​, కోహ్లీల ర్యాంకులు​ ఎంతంటే?

అంతర్జాతీయ క్రికెట్​​ కౌన్సిల్​ క్రికెటర్ల టీ20, టెస్టు, వన్డేల ర్యాంకింగ్స్​ను విడుదల చేసింది. టీమ్​ఇండియా తరఫున టీ20 ర్యాంకింగ్స్​లో ఇషాన్​ కిషన్​ ఒక్కడే నిలవగా.. టెస్టుల్లో ఐదుగురికి, వన్డేల్లో ఇద్దరికి మాత్రమే చోటు దక్కింది. మరి ఈ లిస్ట్​లో ఏ క్రికెటర్​ ర్యాంకు ఎంత ఉందంటే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.