ETV Bharat / bharat

పెట్రోల్​, డీజిల్ స్టాక్ నిల్​.. బంకుల దగ్గర భారీ క్యూలు.. భారత్​లోనే...

author img

By

Published : Jun 15, 2022, 5:13 PM IST

Updated : Jun 15, 2022, 6:09 PM IST

Petrol Diesel Crisis in Rajasthan
రాజస్థాన్​లో పెట్రోల్ సంక్షోభం

Petrol Diesel Crisis in Rajasthan: రాజస్థాన్​లో పెట్రోల్​, డీజిల్​ కొరత ఏర్పడింది. బీసీసీఎల్, హెచ్​పీసీఎల్​లో స్టాక్ లేకపోవడం వల్ల జైపుర్​లో ఐఓసీఎల్​ బంకుల ముందు జనం బారులు తీరారు. ఇంధనం కోసం గంటల కొద్ది క్యూలో నిల్చున్నారు. వాహనదారులు భారీ సంఖ్యలో ఉండటం వల్ల పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేశారు.

పెట్రోల్​, డీజిల్ స్టాక్ నిల్​

Rajasthan Petrol Crisis: రాజస్థాన్ రాజధాని జైపుర్​లో ఐఓసీఎల్ పెట్రోల్ బంకుల ముందు జనం బారులు తీరారు. తమ వాహనాల్లో ఇంధనం నింపుకునేందుకు కిలోమీటర్​ మేర క్యూ కట్టారు. వాహనదారులు ఇంత భారీ సంఖ్యలో గుమికూడటం వల్ల పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. హెచ్​పీసీఎల్, బీపీసీఎల్​ పెట్రోల్ బంకుల్లో మంగళవారం మధ్యాహ్నమే స్టాక్ అయిపోవడం వల్ల జైపుర్​లో పెట్రోల్, డీజిల్​కు తీవ్ర కొరత ఏర్పడింది. దీంతో సాయంత్రం నుంచి నగరంలోని ఐఓసీఎల్ బంకుల వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్నారు వాహనదారులు.

హెచ్​పీసీఎల్, బీపీసీఎల్​ సంస్థలు బంకులకు ఇంధన సరఫరా నిలిపివేయడం వల్ల రాజస్థాన్​లో ఈ పరిస్థితి తలెత్తింది. ప్రస్తుతం ఐఓసీఎల్ బంకుల్లో మాత్రమే పెట్రోల్, డీజిల్ అందుబాటులో ఉంది. రద్దీ దృష్ట్యా బంకు నిర్వాహకులు ఒక్కో వాహనంలో రూ.100 వరకు మాత్రమే పెట్రోల్, డీజిల్​ నింపుతున్నారు. గత్యంతరం లేక ప్రజలు పెద్ద పెద్ద క్యూలలో నిలబడి ఎంతో కొంత ఇంధనాన్ని ట్యాంకుల్లో నింపుకుంటున్నారు.

రాజస్థాన్​లో మొత్తం 7000 వరకు పెట్రోల్​ బంకులున్నాయి. వాటిలో రెండు, మూడు వేల బంకులు బీపీసీఎల్​, హెచ్​పీసీఎల్​కు చెందినవే. అయితే కొద్ది కాలంగా వీటికి ఇంధన సరఫరా నిలిచిపోయింది. దీంతో రాష్ట్రంలో మూడు రోజులుగా పెట్రోల్​, డీజిల్​ కొరత ఏర్పడింది. రాజస్థాన్​లో రోజుకు సగటున 25లక్షల లీటర్ల పెట్రోల్​, కోటి లీటర్ల డీజిల్​ను వినియోగిస్తున్నారు. వీటిలో 50 శాతం ఐఓసీఎల్​ బంకుల నుంచే అమ్ముడవుతోంది. బీపీసీఎల్​, హెచ్​పీసీఎల్​ నుంచి 22శాతం చొప్పున విక్రయిస్తున్నారు. మిగతా 6శాతం ప్రైవేటు కంపెనీల అధీనంలోని పెట్రోల్​ బంకుల ద్వారా అమ్ముడవుతోంది.

ఇదీ చదవండి: మమత నేతృత్వంలో విపక్షాల భేటీ.. 17 పార్టీల నేతలు హాజరు

Last Updated :Jun 15, 2022, 6:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.