ETV Bharat / state

హరీశ్‌తో భూనిర్వాసితులు, కాంగ్రెస్‌ నేతల భేటీ.. ఏం తేలకుండానే ముగిసిన చర్చలు

author img

By

Published : Jun 15, 2022, 5:11 PM IST

Updated : Jun 15, 2022, 7:01 PM IST

సర్కారుతో గౌరవెల్లి ప్రాజెక్ట్‌ భూనిర్వాసితుల చర్చలు సఫలమయ్యాయి. కాంగ్రెస్‌ నేతలతో కలిసి  మంత్రి హరీష్‌రావుతో చర్చించిన నిర్వాసితులు... తమ డిమాండ్లను మంత్రి ముందు ఉంచారు. డిమాండ్లపై మంత్రి సానుకూలంగా స్పందించారు. దీంతో మూడురోజులుగా ఉద్రిక్తంగా మారిన పరిస్థితులు కాస్త చల్లబడ్డట్లైంది.

మంత్రి హరీశ్‌తో భూనిర్వాసితులు, కాంగ్రెస్‌ నేతల భేటీ.. గంటపాటు చర్చలు
మంత్రి హరీశ్‌తో భూనిర్వాసితులు, కాంగ్రెస్‌ నేతల భేటీ.. గంటపాటు చర్చలు

గౌరవెల్లి ప్రాజెక్ట్‌ భూనిర్వాసితులు మంత్రి హరీష్‌రావుతో చర్చలు జరిపారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మెట్టుబండల వద్ద మాజీ ఎంపీ పొన్నం, కాంగ్రెస్‌ నేతలతో కలిసి మంత్రితో చర్చించారు. గంటసేపు జరిగిన చర్చల్లో మంత్రి హరీశ్‌రావు ముందు భూనిర్వాసితులు తమ డిమాండ్లను ఉంచి పరిహారం చెల్లించాలన్నారు. నిర్వాసితుల డిమాండ్లపై మంత్రి హరీశ్‌రావు సానుకూలంగా స్పందించడంతో... చర్చలు సఫలమయ్యాయి.

చర్చల అనంతరం మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పొన్నం ప్రభాకర్‌.. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయినందున నిర్వాసితుల డిమాండ్లు నెరవేర్చాలని సర్కారుని డిమాండ్‌ చేశారు. దాడులు, లాఠీఛార్జీలతో సమస్య పరిష్కారం కాదన్న పొన్నం...భూనిర్వాసితులతో సమావేశమై వాళ్ల సమస్య పరిష్కరించాలన్నారు.

గౌరవెల్లి ప్రాజెక్టుకు మొదట ప్రతిపాదన చేసింది కాంగ్రెస్ పార్టీ. ప్రాజెక్టు ఫలితాలు బాధితులకు అందటం లేదని మంత్రితో చర్చలకు కాంగ్రెస్ పార్టీ మధ్యవర్తిత్వం చేసింది. 18ఏళ్లకు పైబడిన వారికి ప్యాకేజ్, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజ్ కీలకమైంది. రేపు గ్రామస్థులతో చర్చించి.. తుది నిర్ణయం తీసుకుంటాం. సమస్య పరిష్కారం అయ్యే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. - పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ

ఆర్‌అండ్ఆర్ ప్యాకేజ్‌కు మంత్రి హరీశ్‌రావు అంగీకారం చెప్పలేదు. డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇవ్వలేమని మంత్రి తేల్చి చెప్పారు. గృహనిర్మాణం కోసం పట్టణానికి దగ్గర ఆమోదయోగ్యమైన స్థలాన్ని ఇవ్వాలని మంత్రిని కోరాం. కానీ ఇవ్వలేమని మంత్రి హరీశ్‌ తేల్చిచెప్పారు. మొదట గ్రామాన్ని ఖాళీ చేస్తే.. స్థలాలను ఇచ్చేందుకు ఆలోచిస్తామని మంత్రి చెప్పారు. - భూనిర్వాసితుల ఆవేదన

చర్చల కంటే ముందు.... సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి హరీష్‌రావు మాట్లాడారు. గౌరవెల్లి ప్రాజెక్ట్ విషయంలో భాజపా, కాంగ్రెస్ రాజకీయం చేస్తున్నాయని ఆరోపించారు. రెచ్చగొట్టే మాటలు మాట్లాడి అమాయక ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. భూనిర్వాసితులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సీఎం అన్ని విధాలా న్యాయం చేస్తారని మంత్రి అన్నారు. భూనిర్వాసితుల ఆందోళనలపై స్పందించిన స్థానిక ఎమ్మెల్యే సతీష్‌... ప్రాజెక్టులో 95 శాతం భూ సేకరణ పూర్తయ్యిందని...అందరికీ దఫాల వారీగా డబ్బులు చెల్లిస్తున్నామన్నారు. ప్రాజెక్టు ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటివరకు మేజర్లయిన వారికి ప్లాట్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.

ఇవీ చదవండి:

Last Updated :Jun 15, 2022, 7:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.