ETV Bharat / entertainment

ఆ వార్తలపై కరణ్​ జోహార్​ ఫైర్​.. 'వాళ్లకు కరోనా వస్తే నన్నెందుకు నిందిస్తారు?'

author img

By

Published : Jun 15, 2022, 5:54 PM IST

ఇటీవల షారుక్, కత్రినా సహా పలువురు ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. అయితే ఇందుకు కరణ్​ జోహార్​ ఇచ్చిన పార్టీనే కారణమని విమర్శలు వచ్చాయి. తాజాగా దీనిపై స్పందించిన కరణ్​.. వాళ్లకు వైరస్​ సోకితే తనను ఎందుకు నిందిస్తున్నారని ప్రశ్నించాడు.

d
d

షారుక్ ఖాన్‌, కత్రినాకైఫ్‌తోపాటు పలువురు బాలీవుడ్‌ సెలబ్రిటీలు ఇటీవల కరోనా బారినపడ్డారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. బీటౌన్‌లో కరణ్‌ జోహార్‌ ఇచ్చిన బర్త్‌డే పార్టీ వల్లే సెలబ్రిటీలకు కరోనా వచ్చిందని పలువరు చెప్పుకొన్నారు కూడా. ఆ పార్టీని 'కరోనా సూపర్‌ స్ప్రెడర్‌'గా అభివర్ణిస్తూ పలు ఆంగ్ల పత్రికల్లోనూ వార్తలు వచ్చాయి. వీటిపై తాజాగా కరణ్‌ స్పందించారు.

"నేను ఇచ్చిన బర్త్‌డే పార్టీ 'కరోనా సూపర్‌ స్ప్రెడర్‌' అంటూ పలు పత్రికల్లో వార్తలు వచ్చాయి. అయితే, ఈ వైరస్‌ ఎవరి నుంచి ఎవరికి ఎలా వచ్చిందో? ఎప్పుడు వచ్చిందో? ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఆ వారంలోనే ఇండస్ట్రీలో ఎన్నో ఫంక్షన్లు, సినిమా షూటింగులు, పెళ్లిళ్లు జరిగాయి. అలాంటప్పుడు నన్నే ఎందుకు నిందిస్తున్నారు? ప్రతిసారీ నన్నే ఎందుకు తక్కువ చేసి చూస్తున్నారు? ఈ మహమ్మారిని నేను సృష్టించలేదు, దాన్ని నేను వ్యాప్తి చేయలేదు. నాకు దానితో ఎలాంటి సంబంధంలేదు. అలాంటప్పుడు నన్నెందుకు శిక్షిస్తూ వార్తలు రాస్తున్నారు" అని కరణ్‌ ప్రశ్నించారు.

50వ పడిలోకి అడుగుపెట్టిన సందర్భంగా మే 25న తన పుట్టినరోజుని పురస్కరించుకుని కరణ్‌ గ్రాండ్‌ పార్టీ ఇచ్చారు. కత్రినా, షారుక్, కాజోల్‌, రాణీ ముఖర్జీ, అనన్యా పాండే, రణ్‌బీర్‌ కపూర్‌, నీతూకపూర్‌, రష్మిక, విజయ్‌ దేవరకొండ, తమన్నా, పూజాహెగ్డే, రణ్‌వీర్‌ సింగ్‌, సల్మాన్‌ఖాన్‌.. ఇలా ఎంతోమంది స్టార్స్‌ ఈ పార్టీలో పాల్గొని సందడి చేశారు.

ఇదీ చూడండి : 'జబర్దస్త్ విషయంలో ఆ తప్పు చేశా.. నా రెమ్యునరేషన్ తెలియగానే వారంతా షాక్!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.