ETV Bharat / city

TOP NEWS: టాప్ న్యూస్ @ 11AM

author img

By

Published : Jun 2, 2022, 10:58 AM IST

TOP NEWS
టాప్ న్యూస్

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

  • ' దేశానికే ఆదర్శంగా నిలిచాం'

CM KCR on Telangana Formation Day : రాష్ట్రం ఏర్పడిన ఎనిమిదేళ్లలో ఎంతో అభివృద్ధి సాధించామని సీఎం కేసీఆర్‌ అన్నారు. దేశానికే దిశానిర్దేశం చేసే రాష్ట్రంగా తెలంగాణ మారిందని తెలిపారు. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లో నిర్వహించిన రాష్ట్రావతరణ వేడుకల్లో జాతీయ పతాకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ప్రజలందరికీ రాష్ట్రావిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

  • రాష్ట్రానికి సేవ చేస్తూనే ఉంటాను

Telangana Formation Day Celebrations 2022: ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నా రాష్ట్రానికి సేవ చేస్తూనే ఉంటానని గవర్నర్‌ తమిళిసై స్పష్టం చేశారు. రాజ్‌భవన్‌లో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల కేక్‌తోపాటు... తన పుట్టినరోజు సందర్భంగా కేకు కోశారు. ప్రజల కోసం కృషి చేసిన వారిని, ప్రతిభావంతులను సత్కరించారు. అసెంబ్లీ, శాసనమండలిలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

  • ' సకల జనుల పోరాటం మరువలేనిది'

Kishan Reddy On Telangana Formation Day: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో సకలు జనులు పోరాటం చేశారని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి అన్నారు. ఆనాడు యూపీఏ సర్కార్ మెడలు వంచి పోరాడామన్న కిషన్​రెడ్డి... కేంద్రం తరఫున అధికారికంగా దిల్లీలో రాష్ట్రావతరణ దినోత్సవం జరుపుతున్నట్లు వెల్లడించారు.

  • సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్య

హైదరాబాద్​లోని గచ్చిబౌలిలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. నానక్‌రామ్‌గూడలోని అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న కృతి సంబ్యాల్‌ బలవన్మరణానికి పాల్పడింది.

  • ఒకరినొకరు కాల్చుకొని జవాన్లు మృతి

SRPF Jawan Fired: ఇద్దరు ఎస్​ఆర్​పీఎఫ్ జవాన్లు పరస్పరం కాల్పులు జరుపుకున్నారు. ఈ ఘటనలో ఇరువురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మహారాష్ట్రలోని గడ్చిరోలిలో జరిగింది.

  • సముద్రాన్ని ఈది బంగ్లాదేశ్​ నుంచి భారత్​కు..!

ఫేస్​బుక్​లో పరిచయమైన యువకుడిని గాఢంగా ప్రేమించింది ఆ బంగ్లాదేశ్​ యువతి. అతడినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. అనుకున్నదే తడవుగా పులులు తిరిగే అడవిని దాటి, మొసళ్లతో నిండిన నదిని ఈది భారత్​కు​ చేరుకుంది. ఆలయంలో వివాహం కూడా చేసుకుంది. అక్కడే అసలు ట్విస్ట్​ మొదలైంది. అమ్మాయి గురించి తెలుసుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అసలేం జరిగిందంటే?

  • గర్భిణీ టీచర్​ దారుణ హత్య

Pregnant Teacher Murder: ఐదు నెలల గర్భిణీ టీచర్​ను గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఈ విషాద ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని అయోధ్యలో బుధవారం జరిగింది. అయితే ఈ ఘటనపై స్పందించిన ఎస్పీ అధినేత అఖిలేశ్​ యాదవ్.. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు దుండగులకు ఉపాధ్యాయులు లక్ష్యంగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు.

  • భారత్​లో పెరిగిన కరోనా కేసులు

India Covid cases: భారత్​లో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా 3,712 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా మరో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. బుధవారం 2584 మంది కోలుకున్నారు.

  • రజనీతో దానిపై మాట్లాడను

Kamal Haasan on Rajinikanth: యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నటించిన 'విక్రమ్' శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఇటీవలే మీడియాతో మాట్లాడిన కమల్​.. తన స్నేహితుడు, సూపర్​స్టార్ రజనీకాంత్​ గురించి ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. రజనీతో సినిమాల నుంచి ప్రజల వరకు అన్ని విషయాలు మాట్లాడే కమల్​.. ఓ విషయం గురించి మాత్రం ప్రస్తావన తీసుకురారట. అదేంటంటే..

  • వివాహ బంధంలోకి భారత స్టార్​ క్రికెటర్

Deepak Chahar Wedding: వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు టీమ్​ఇండియా స్టార్ ఆల్​రౌండర్ దీపక్ చాహర్. తన కల్యాణానికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.