ETV Bharat / bharat

సహోద్యోగిని కాల్చి చంపి.. జవాన్​ ఆత్మహత్య.. ఆ గొడవే కారణం?

author img

By

Published : Jun 2, 2022, 10:23 AM IST

Updated : Jun 2, 2022, 11:36 AM IST

SRPF Jawan Fired: భద్రతా విధుల్లో ఉన్న సహోద్యోగిని మరో జవాను కాల్చి చంపాడు. ఆ తర్వాత అతడు కూడా కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని గడ్చిరోలిలో జరిగింది.

SRPF Jawan Fire
SRPF Jawan Fire

Two Jawans Fired On Each Other: మహారాష్ట్రలోని గడ్చిరోలిలో ఒక ఎస్​ఆర్​పీఎఫ్​ జవాన్​ను అతడి సహోద్యోగిని సర్వీస్​ రైఫిల్​తో కాల్చి చంపాడు. ఆ తర్వాత అతడు కూడా కాల్చుకుని ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన మార్ఫాలి గ్రామంలో బుధవారం సాయంత్రం జరిగింది.
మృతులను పుణెకు చెందిన శ్రీకాంత్ బైర్డ్(35), బందు నవతారేగా (33) పోలీసులు గుర్తించారు. బందు నవాతారేపై శ్రీకాంత్​ కాల్పులు జరిపినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. వ్యక్తిగత వివాదంతోనే కాల్చినట్లు ప్రాథమిక సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న సీనియర్ పోలీసు అధికారి ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఇవీ చదవండి: సముద్రాన్ని ఈది బంగ్లాదేశ్​ నుంచి భారత్​కు.. ప్రియుడి కోసం యువతి సాహసం!

గర్జించిన భరతమాత ముద్దుబిడ్డలు.. 'గదర్​ ఉద్యమం'తో బ్రిటిషర్లకు చుక్కలు!

Last Updated : Jun 2, 2022, 11:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.