TOP NEWS: టాప్ న్యూస్ @ 7PM

author img

By

Published : May 14, 2022, 6:58 PM IST

టాప్ న్యూస్

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

  • కోర్‌ కమిటీతో అమిత్‌ షా భేటీ.. పార్టీ బలోపేతం, చేరికలపై కీలక సూచనలు..!

శంషాబాద్‌లోని నోవాటెల్‌ హోటల్‌లో రాష్ట్ర భాజపా కోర్‌కమిటీతో కేంద్రమంత్రి అమిత్​షా భేటీ అయ్యారు. తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అందరూ కష్టపడి పని చేయాలని కమిటీ సభ్యులకు అమిత్​షా దిశా నిర్దేశం చేశారు.

  • ఈ నెల 25న విభజన సమస్యలపై త్రిసభ్య కమిటీ భేటీ

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య పెండింగ్​లో విభజన అంశాలకు సంబంధించి వివాద పరిష్కార ఉపసంఘం ఈ నెల 25న సమావేశం కానుంది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ దృశ్యమాధ్యమం ద్వారా సమావేశం కానుంది.

  • 'క్లబ్​లు, పబ్​లు తప్ప ఏం తెలియని వాళ్లు.. మరో అవకాశం అడుగుతున్నారు'

KTR Comments in Haliya: సాగు, తాగు నీరులో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని మంత్రి కేటీఆర్​ అన్నారు. రైతులకు ఏదో చేస్తామంటూ కొందరు వస్తుంటారని.. వాళ్లను నమ్మొద్దని హితవు పలికారు.

  • జొన్న చేను కోస్తుండగా చిరుతపులి ప్రత్యక్షం​.. రైతులు ఏం చేశారంటే..?

Video Viral: జొన్న చేను కోతలో మునిగిపోయిన రైతులను ఓ చిరుతపులి ఆగం చేసింది. చేనులోకి ఎప్పుడొచ్చిందో..? పంట కోస్తున్న సమయంలో దర్శనమిచ్చింది. ఇంకేముంది.. చిరుతను చూసి గజ్జుమన్న రైతులు.. భయంతో కేకలు వేయటం ప్రారంభించారు.

  • తండ్రి పాదాలు కడిగిన కుమారుడు.. ఇంట్లోంచి గెంటేసిన కొన్నాళ్లకే..

Son Washed Father Feet: రాత్రింబవళ్లు కష్టపడి పెంచిన కుమారుడే.. వృద్ధ తండ్రిని ఇంట్లోంచి గెంటివేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్​లోని జబల్​పుర్​లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

  • 31వేల గులాబీలతో ఇల్లు.. 4 లక్షల పుష్పాలతో కళాకృతులు

తమిళనాడులో 17వ 'రోజ్ షో' సందర్శకులను ఆకట్టుకుంది. శనివారం రోజ్​ షో ప్రారంభం కాగా.. పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. గులాబీలతో ఏర్పాటు చేసిన పలు ఆకృతులు షోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

  • అమృత్​సర్​ గురునానక్​ దేవ్​ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం

Gurunanak dev hospital Fire: అమృత్‌సర్‌లోని గురునానక్‌ దేవ్‌ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు పెద్దఎత్తున ఎగిసిపడ్డాయి. ట్రాన్స్‌ఫార్మర్‌లో మంటలు చెలరేగి ఆస్పత్రికి వ్యాపించడం వల్ల ఈ ప్రమాదం జరిగింది.

  • చైనాకు త్వరలో కొత్త అధ్యక్షుడు.. జిన్​పింగ్ రాజీనామా!

XI Jinping: చైనా అధ్యక్షుడు జిన్​పింగ్ తన పదవికి రాజీనామా చేస్తారని వదంతులు వ్యాపిస్తున్నాయి. కరోనా కట్టడిలో విఫలం కావడమే గాక, ఆర్థికవ్యవస్థ పతనానికి జిన్​పింగ్ తప్పుడు నిర్ణయాలే కారణమని చైనా కమ్యూనిస్టు పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

  • రాయుడు ట్వీట్​తో గందరగోళం.. సీఎస్​కే క్లారిటీ

Ambati Rayudu: తనకు ఇదే చివరి ఐపీఎల్​ అని ట్వీట్​ చేసి షాక్ ఇచ్చాడు సీఎస్​కే బ్యాటర్​ అంబటి రాయుడు. అయితే ఆ తర్వాత కాసేపటికే ట్వీట్​ను డిలీట్​ చేశాడు. దీనిపై సీఎస్​కే క్లారిటీ ఇచ్చింది.

  • పోర్న్​ ఇండస్ట్రీని ఏలిన ఈ శృంగార తారలు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే?

ఇంటర్నెట్​ అందుబాటులోకి వచ్చాక.. పోర్న్​ ఇండస్ట్రీ జెట్​ స్పీడ్​తో దూసుకుపోయింది. ఆ తర్వాత అడల్ట్​ ఇండస్ట్రీలో అవకాశాలు విస్తృతంగా పెరిగాయి. ఈ క్రమంలోనే సన్నీలియోనీ లాంటి ఎందరో శృంగార తారలు వెలుగులోకి వచ్చి.. చాలా పాపులర్​ అయ్యారు.


ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.