ETV Bharat / city

Top news: టాప్ న్యూస్ @ 9PM

author img

By

Published : Jan 23, 2022, 8:58 PM IST

TOP NEWS IN TELANGANA
TOP NEWS IN TELANGANA

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు...

  • కేంద్రానికి కేటీఆర్​ 5 లేఖలు..

KTR Letter To Nirmala Seetharaman: వచ్చే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్​లో రాష్ట్రానికి అధిక నిధులు కేటాయించాలని కోరుతూ.. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్​కు మంత్రి కేటీఆర్ ఐదు వేర్వేరు లేఖలు రాశారు. తెలంగాణలో పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన.. ఇతర కార్యక్రమాల కోసం కేంద్ర బడ్జెట్​లో నిధులను కేటాయించాలని కోరారు.

  • సీఎం కేసీఆర్​కు యూఎస్పీసీ జాక్టో లేఖ..

USPC letter to CM KCR: సీఎం కేసీఆర్‌కు ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి- యూఎస్పీసీ జాక్టో లేఖ రాసింది. బదిలీల విషయమై ఉద్యోగుల అభ్యంతరాలు పట్టించుకోకుండా కేటాయింపులు జరిగాయని లేఖలో ఆరోపించింది. 317 జీవోలోని లోపాలు సవరించి.. ఉద్యోగ నియామకాల్లో స్థానికతను కాపాడాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది.

  • రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి..

Telangana New Corona Cases: తెలంగాణలో కరోనా వైరస్ ఉద్ధృతి ఏ మాత్రం తగ్గడం లేదు. రోజువారీ కేసులు భారీగానే నమోదవుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో కొత్తగా 3,603 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారిన పడి మరొకరు ప్రాణాలొదిలారు. వైరస్ నుంచి మరో 2,707 మంది బాధితులు కోలుకున్నారు.

  • వెంకయ్యకు మరోసారి కరోనా..

Vice president Venkaiah Naidu Corona: ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడుకు కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. ప్రస్తుతం హైదరాబాద్​లో ఉన్న ఆయన.. స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు.

  • కర్ణాటకలో కొవిడ్​ విజృంభణ..

Covid Cases in India: పలు రాష్ట్రాల్లో రోజువారీ కరోనా కేసుల్లో భారీగా పెరుగుదల నమోదైంది. కర్ణాటకలో ఒక్కరోజే 50 వేలకుపైగా కేసులు బయటపడ్డాయి. అయితే దిల్లీలో కరోనా 10 వేల దిగువన నమోదయ్యాయి.

  • నేతాజీ విగ్రహం.. భావితరాలకు స్ఫూర్తి

Netaji hologram statue India Gate: ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్ర బోస్ హాలోగ్రామ్​ విగ్రహాన్ని ఆవిష్కరించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. నేతాజీ 125వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. నేతాజీ విగ్రహం.. ప్రజాస్వామ్య విలువల్ని గుర్తుచేస్తూ, భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని తెలిపారు.

  • త్వరలోనే మా మంత్రి అరెస్ట్​..

Punjab Elections Kejriwal: దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​ మరోసారి భాజపాపై విరుచుకుపడ్డారు. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో కేంద్రం.. మరోసారి దర్యాప్తు సంస్థలను రంగంలోకి దించేందుకు చూస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే దిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్​ను అరెస్ట్​ చేసేందుకు ఈడీ సిద్ధంగా ఉందని ఆరోపించారు.

  • పిల్లలపై మంత్రి కుమారుని కాల్పులు..

Minister son gun fire: మంత్రి ఇంటి పక్కన ఉన్న మామిడి తోటలో పిల్లలంతా చేరి ఆటలు ఆడుకోవడం తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఆవేశంలో మంత్రి కుమారుడు తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపి, అనుచరులతో కలిసి దాడి చేయగా.. అనేక మంది గాయపడ్డారు.

  • క్రికెట్లర్లలో పుష్ప మేనియా.. తగ్గేదేలే..

Cricketers Pushpa: ప్రస్తుతం ఎక్కడచూసినా 'పుష్ప' సినిమా పేరు మార్మోగుతోంది. ఐకాన్‌ స్టార్‌ అల్లూ అర్జున్‌ నటించిన ఈ సినిమాకు సినీప్రియులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులు, స్టార్‌ క్రికెటర్లు కూడా ఫిదా అవుతున్నారు. ఈ సినిమాలో పాటలకు స్టెప్పులేస్తున్నారు. 'తగ్గేదేలే' అంటూ డైలాగ్‌లు చెప్తూ అభిమానులను అలరిస్తున్నారు. వాటికి సంబంధించిన వీడియోలను చూసేద్దాం..

  • పెళ్లిపెద్దగా మారిన సాహో బ్యూటీ..

తన మేకప్ ఆర్టిస్ట్ పెళ్లిలో తెగ సందడి చేసింది హీరోయిన్ శ్రద్ధాకపూర్. పెళ్లి పెద్దగా వ్యవహరించిన వీడియో ప్రస్తుతం వైరల్​గా మారింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.