ETV Bharat / bharat

'నేతాజీ విగ్రహం.. భావితరాలకు స్ఫూర్తి'

author img

By

Published : Jan 23, 2022, 6:37 PM IST

Updated : Jan 23, 2022, 7:41 PM IST

PM Modi unveils Netaji's hologram statue at India Gate
నేతాజీ విగ్రహం, ప్రధాని మోదీ

Netaji hologram statue India Gate: ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్ర బోస్ హాలోగ్రామ్​ విగ్రహాన్ని ఆవిష్కరించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. నేతాజీ 125వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. నేతాజీ విగ్రహం.. ప్రజాస్వామ్య విలువల్ని గుర్తుచేస్తూ, భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని తెలిపారు.

Netaji hologram statue India Gate: స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పించింది కేంద్రం. దిల్లీలోని ఇండియా గేట్​ వద్ద అబ్బురపరిచే నేతాజీ హాలోగ్రామ్​( బీమ్​ లైట్లతో ఏర్పాటు చేసే 3డీ చిత్రం) విగ్రహాన్ని ఆవిష్కరించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆ స్థానంలో గ్రానైట్​తో తయారు చేసే విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు.

నేతాజీకి భారత్​ రుణపడి ఉంటుందని, ఇందుకు విగ్రహమే తార్కాణమని పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పూర్తిస్థాయి విగ్రహం రూపొందే వరకు ఈ ప్రదేశంలో నేతాజీ హాలోగ్రామ్ విగ్రహం ఉంటుందని మోదీ తెలిపారు.

" స్వాతంత్య్రం పోరాడి సాధించాలి.. అభ్యర్థించేది కాదని నేతాజీ అనేవారు. బ్రిటిషర్లకు తలొగ్గడాన్ని ఆయన ఎప్పుడూ తిరస్కరించేవారు. త్వరలోనే హాలోగ్రామ్​ విగ్రహం స్థానంలో గ్రానైట్​ విగ్రహం ఏర్పాటు చేస్తాం. నేతాజీ విగ్రహం.. ప్రజాస్వామ్య విలువలను గుర్తు చేస్తుంది. భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. స్వతంత్ర భారతావనిని తీసుకువచ్చే ఆకాంక్షను ఎప్పటికీ కోల్పోవద్దని, భారత్​ను కదిలించే శక్తి ఎవరికీ లేదని నేతాజీ చెప్పేవారు. స్వతంత్ర భారత్​ కలలను సాకారం చేయటమే మన ముందు ఉన్న లక్ష్యం. 100వ స్వాతంత్య్ర దినోత్సవంలోపు నవ భారత్​ను రూపొందించాలి. నేతాజీ సుభాష్​ చంద్రబోస్​కు సంబంధించిన రహస్య దస్త్రాలను బయటపెట్టే అవకాశం మా ప్రభుత్వానికి లభించటం అదృష్టంగా భావిస్తున్నా. "

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

అనంతరం 2019, 2020, 2021, 2022 ఏడాదికి గాను సుభాష్ చంద్ర బోస్​ అప్డా ప్రబంధన్​ పురస్కారాలను ప్రదానం చేశారు మోదీ.

PM Modi unveils Netaji's hologram statue at India Gate
బోస్​ పురస్కారాలు ప్రదానం చేస్తున్న మోదీ

గతంలో విపత్తు నిర్వహణను వ్యవసాయ శాఖ చూసుకునేదని.. తమ ప్రభుత్వం ఎన్​డీఆర్​ఎఫ్​ను బలోపేతం చేసిందని తెలిపారు మోదీ. విపత్తు నిర్వహణ రంగంలో చేపట్టిన సంస్కరణలను అంతర్జాతీయ సంస్థలు ప్రశంసించినట్లు గుర్తు చేశారు. ఎన్​డీఆర్​ఎఫ్​ను ఆధునికీకరించి.. దేశవ్యాప్తంగా విస్తరించామన్నారు. స్పేస్​ టెక్నాలజీ వంటి అన్ని విధానాలను తీసుకొచ్చామని తెలిపారు. దేశ సేవలో ప్రాణాలు కోల్పోయిన ఎన్​డీఆర్​ఎఫ్​, ఎస్​డీఆర్​ఎఫ్​ సిబ్బందికి నివాళులర్పించారు మోదీ.

​'సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: ఆంగ్లేయుల నయవంచనకు మౌన సాక్ష్యం 'ఇండియా గేట్

Last Updated :Jan 23, 2022, 7:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.