ETV Bharat / sports

'పుష్ప' మేనియా.. స్టార్​ క్రికెటర్స్​ ఎక్కడా తగ్గట్లేదుగా!

author img

By

Published : Jan 23, 2022, 7:55 PM IST

Cricketers Pushpa: ప్రస్తుతం ఎక్కడచూసినా 'పుష్ప' సినిమా పేరు మార్మోగుతోంది. ఐకాన్‌ స్టార్‌ అల్లూ అర్జున్‌ నటించిన ఈ సినిమాకు సినీప్రియులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులు, స్టార్‌ క్రికెటర్లు కూడా ఫిదా అవుతున్నారు. ఈ సినిమాలో పాటలకు స్టెప్పులేస్తున్నారు. 'తగ్గేదేలే' అంటూ డైలాగ్‌లు చెప్తూ అభిమానులను అలరిస్తున్నారు. వాటికి సంబంధించిన వీడియోలను చూసేద్దాం..

pushpa cricketers
పుష్ప క్రికెటర్లు

Cricketers Pushpa: ఐకాన్‌స్టార్‌ అల్లుఅర్జున్‌ నటించిన 'పుష్ప' సినిమా క్రేజ్‌ ఏమాత్రం తగ్గడంలేదు. 'పుష్పరాజ్‌'గ బన్నీ నటన, ఆయన బాడీ లాంగ్వేజ్‌, పంచ్‌ డైలాగ్‌లు, మ్యూజిక్‌ ఇలా ఈ సినిమాలోని చాలా విశేషాలు ప్రతి ఒక్కర్నీ విపరీతంగా ఆకర్షించాయి. మైదానంలో తమ బ్యాటింగ్‌తో ఎంతోమంది క్రీడాభిమానులను సొంతం చేసుకున్న స్టార్‌క్రికెటర్లు సైతం 'పుష్ప' సినిమాలో పాటలకు స్టెప్పులేస్తూ, డైలాగ్‌లు చెప్తున్నారు. ఇందులో భాగంగానే.. ఆస్ట్రేలియా క్రికెటర్‌, సన్‌రైజర్స్‌ మాజీ కెప్టెన్ డేవిడ్‌ వార్నర్‌.. ఈ సినిమాలో డైలాగ్‌ చెప్పి నెటిజన్లను ఫిదా చేశాడు. తాజాగా మరోసారి.. శ్రీవల్లి పాటకు స్టెప్పులేసి అభిమానులను అలరించాడు. ఈ పాటలో అచ్చం అల్లు అర్జున్‌ను గుర్తుకు తెచ్చేలా స్టెప్పులేసి అదరగొట్టాడు. అతడి కూతుర్లు కూడా 'సామీ సామీ' పాటకు చిందులేశారు.

Pushpa suresh raina: టీమ్​ఇండియా మాజీ క్రికెటర్, చెన్నై సూపర్‌కింగ్స్‌ ఆటగాడు సురేశ్‌ రైనా కూడా పుష్పరాజ్‌ అవతారమెత్తాడు. పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాటకు.. బన్నీ సిగ్నేచర్‌ మూమెంట్‌ను అచ్చుగుద్దినట్టుగా దించేశాడు. ఈ వీడియోను.. సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసిన రైనా సినిమాలో అల్లూ అర్జున్‌ నటనను మెచ్చుకున్నారు.

Pushpa Surykakumar yadav: యువ క్రికెటర్లు ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ శ్రీవల్లి పాటకు స్టెప్పులేశారు. ఇద్దరు ఆటగాళ్లు కలిసి.. శ్రీవల్లి అంటూ వేసిన స్టెప్పులు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి.

Pushpa Ravindra Jadeja: టీమ్​ఇండియా స్టార్‌ క్రికెటర్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాడు..రవీంద్ర జడేజా కూడా పుష్ప సినిమాకు ఫిదా అయిపోయాడు. పుష్ప, పుష్పరాజ్‌... తగ్గేదేలే అంటూ తెలుగులో డైలాగ్‌ చెప్పాడు. సినిమాలో పుష్పరాజ్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా.... జడేజా చెప్పిన డైలాగ్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Pushpa Shikar Dhawan: భారత్‌ స్టార్‌ క్రికెటర్ శిఖర్‌ ధావన్‌, టీమ్​ఇండియా మాజీ ఆటగాడు ఇర్ఫాన్‌ పఠాన్‌లు సైతం ఈ మూవీకి ఫిదా అయిపోయారు. సినిమాలోని డైలాగ్‌లను పుష్పరాజ్ మ్యానరిజంలో చెప్పి అభిమానులను అలరించారు.

Pushpa Rahul chahar: టీమ్​ఇండియా బౌలర్‌, ఆర్సీబీ ప్లేయర్​ రాహుల్‌ చాహర్‌ కూడా పుష్ప సినిమాలోని పాటకు స్టెప్పులేశాడు. సినిమాలో అల్లు అర్జున్‌కు ఏ మాత్రం తగ్గేదేలే అనేలా శ్రీవల్లి పాటకు కాళ్లు కదిపాడు.

మరోవైపు టీమ్​ఇండియా క్రికెటర్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటగాడు ఖలీల్‌ అహ్మాద్‌ పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాటకు స్టెప్పులేసి అదరగొట్టాడు. మరోవైపు.. ప్రో కబడ్డీ గుజరాత్‌ జట్టు ఆటగాళ్లు సైతం శ్రీవల్లి పాటకు స్టెప్పులేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఇదీ చూడండి:

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

'శ్రీవల్లి' పాటకు స్టెప్పులేసిన రైనా.. బన్నీ నటనకు ఫిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.