ETV Bharat / city

Telangana Top News : టాప్ న్యూస్ @ 9AM

author img

By

Published : Feb 18, 2022, 8:59 AM IST

Telangana Top News
Telangana Top News

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

  • అదుపుతప్పి కారు బోల్తా.. ముగ్గురు విద్యార్థులు మృతి

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. కారు బోల్తాపడిన ఘటనలో ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. నిన్న నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దుండలోని ఓ వివాహ విందుకు హాజరయ్యారు. రాత్రి హైదరాబాద్‌కు తిరిగివస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

  • ఆ మూడు గంటలు ఏమైంది?

ఈనెల 14న రాత్రి ఇంటి నుంచి బయటకువెళ్లిన బాలిక అనుమానాస్పద మృతి కేసులో బలమైన ఆధారాలు దొరకడం లేదు. 10.30 గంటలకు బయటకువెళ్లిన బాలిక ఒంటి గంట సమయంలో మృతిచెందినట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే ఈ మూడు గంటల్లో ఏం జరిగిందనేది తెలియడం లేదు.

  • పోషకాల బియ్యమే తీసుకుంటాం

యాసంగి సీజన్​లో పోషకాలు మిళితం చేసిన ఉప్పుడు బియ్యమే తీసుకుంటామని రాష్ట్రానికి ఎఫ్​సీఐ స్పష్టం చేసింది. పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. వచ్చే వారం నుంచి రోజువారీగా 50 శాతం సాధారణ ఉప్పుడు బియ్యం, 50 శాతం బలవర్ధక ఉప్పుడు బియ్యాన్ని మాత్రమే తీసుకుంటామని తేల్చి చెప్పింది.

  • యూపీలో భాజపా 'సురక్ష' నినాదం గెలిపిస్తుందా?

ఎస్పీ అధికారంలో ఉన్న సమయంలో జరిగిన పలు ఘటనలను ఎన్నికల ప్రచారంలో భాజపా పదేపదే గుర్తు చేస్తోంది. సురక్ష నినాదాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తోంది. దీనిని భాజపా ప్రధానాస్త్రంగా చేసుకుని యూపీ ఎన్నికల్లో ముందుకు వెళ్తోంది.

  • అంతర్గత కలహాలే.. అసలు సవాల్​

పంజాబ్‌లో అధికారాన్ని నిలబెట్టుకోవాలన్న కాంగ్రెస్‌ ప్రయత్నాలకు సిద్ధూ, సీఎం చరణ్‌జీత్‌సింగ్‌ చన్నీ శిబిరాల మధ్య విభేదాలు అతిపెద్ద సవాళ్లుగా మారాయి. ఆ రెండు వర్గాలు సహకరించుకోవడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సిద్ధూ వైఖరి.. కాంగ్రెస్​ గెలుపుపై ప్రభావం చూపుతుందా? ప్రత్యర్థులు స్వపక్ష నేతలే ఎందుకయ్యారు. ‘ఒక కుటుంబానికి ఒకటే టికెట్‌’ విధానం తెచ్చిన తంట ఏంటి?

  • గేమ్స్​కు బానిసై.. 14 ఏళ్ల బాలుడు ఆత్మహత్య!

గేమింగ్ వ్యసనం ఓ 14 ఏళ్ల బాలుడి ప్రాణాలు తీసింది. ముంబయిలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • క్రిప్టో కరెన్సీలో మదుపు చేయాలనుకుంటున్నారా?

క్రిప్టో కరెన్సీపై వచ్చిన ఆదాయానికి పన్ను విధిస్తున్నట్లు బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి ప్రకటించారు. దీంతో ఈ డిజిటల్‌ ఆస్తులు మరోసారి వార్తల్లోకి వచ్చాయి. పన్ను పరిధిలోకి తీసుకురావడం ద్వారా వీటిని నిషేధించే ఆలోచన ప్రభుత్వానికి లేదని కొంత మేరకు గ్రహించవచ్చు. వాటికి చట్టబద్ధత కల్పించే విషయంలో స్పష్టత ఇప్పటికీ రాలేదు. రోజుకో కొత్త క్రిప్టో కరెన్సీలు వస్తున్న నేపథ్యంలో వీటిలో మదుపు చేసేముందు తెలుసుకోవాల్సిన అంశాలేమిటో చూడండి..

  • 'తక్కువ ప్రతిఫలంతో స్థిరాస్తి అభివృద్ధిదార్లకు ఇక్కట్లు'

స్థిరాస్తి అభివృద్ధి సంస్థలు తమ పెట్టుబడిపై అతి తక్కువ ప్రతిఫలాన్ని పొందుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ప్రముఖ మదుపరి రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా వెల్లడించారు. అందుకే ఆయా కంపెనీలను స్టాక్‌ మార్కెట్‌లో నమోదు చేయొద్దని సూచించారు.

  • సెమీఫైనల్లోకి సానియా జోడీ

దుబాయ్​ టెన్నిస్​ ఛాంపియన్​షిప్స్​లో సానియా మీర్జా- లూసీ హర్దెకా జోడీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. క్వార్టర్స్​లో షుకో- అలెక్సాండ్రా క్రునిక్​ ద్వయంపై విజయం సాధించింది.

  • 'ఆడవాళ్లు మీకు జోహార్లు' ట్రైలర్ ఎప్పుడంటే?

శర్వానంద్​, రష్మిక కలిసి నటించిన 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమా ట్రైలర్​ను ఈనెల 19న విడుదల చేయనున్నారు. శుక్రవారం సాయంత్రం 6:03గంటలకు మూడో లిరికల్‌ గీతాన్ని విడుదల చేయనుంది చిత్రబృందం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.