ETV Bharat / city

Allu arjun help For Flood Victims: వరద బాధితులకు అల్లు అర్జున్ రూ.25 లక్షల సాయం

author img

By

Published : Dec 2, 2021, 10:19 PM IST

Allu arjun help For Flood Victims
వరద బాధితులకు సాయమందించిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్

allu arjun donation: ఏపీలో వరద బాధితులను ఆదుకునేందుకు సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ తమ వంతుగా.. ముఖ్యమంత్రి సహయ నిధికి విరాళం అందించగా.. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వరద బాధితుల కోసం సాయాన్ని ప్రకటించారు.

Allu arjun Donation: ఆంధ్రప్రదేశ్​లోని కొన్ని ప్రాంతాలను ఊహించని వరదలు ముంచెత్తాయి. కొన్ని దశాబ్దాలలో చూడనటువంటి విపత్తును చవిచూసింది ఆంధ్రప్రదేశ్. ముఖ్యంగా నెల్లూరు, రాయలసీమ ప్రాంతాలు పూర్తిగా జలమయం అయిపోయాయి. తిరుపతిని గత కొన్ని దశాబ్దాలలో చూడని జల విలయం చుట్టేసింది. ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. ఈ వరదల కారణంగా వందల కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లింది. పదుల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి సమయంలో బాధితులను ఆదుకునేందుకు సినీ పరిశ్రమలోని పలువురు ప్రముఖులు ముందుకొచ్చారు.

  • My heart goes out to the people of #AndhraPradesh who have been affected by the recent floods. I am making a contribution of Rs 25 lakh towards @AndhraPradeshCM Relief Fund to aid with the rehabilitation efforts.

    — Allu Arjun (@alluarjun) December 2, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Bunny donation: ఎప్పుడు ఏ విపత్తు వచ్చినా.. మేమున్నామని అండగా నిలబడటానికి సినిమా ఇండస్ట్రీ ముందుంటుంది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ తమ వంతుగా విరాళం అందించారు. ఈ క్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన వంతు సహాయం అందించారు. ఏపీలోని నెల్లూరు, రాయలసీమ ప్రాంతాలను ముంచెత్తిన వరదల కారణంగా నష్టపోయిన బాధితుల కోసం తనవంతు సహాయంగా రూ.25 లక్షలను ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు.

allu arjun help: గతంలోనూ ఎన్నో సహాయ కార్యక్రమాలు చేపట్టారు బన్నీ. కరోనా సమయంలో రూ.1.25 కోట్ల విరాళం అందించారు. అదేవిధంగా.. కేరళను వరదలు ముంచెత్తినప్పుడూ రూ. 25 లక్షలు విరాళం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్​ను వరదలు బాధాకరమన్న ఆయన.. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఇదీ చదవండి:

బెంగళూరులో రెండు ఒమిక్రాన్‌ కేసులు గుర్తింపు: కేంద్రం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.