ETV Bharat / city

బీ అలర్ట్​.. మరో 48 గంటల్లో అల్పపీడనం..!

author img

By

Published : Oct 18, 2022, 4:28 PM IST

rains
వర్షాలు

TS Weather Report: రాష్ట్రంలో నేడు, రేపు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాగల 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది.

TS Weather Report: రాష్ట్రంలో నేడు, రేపు పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఎల్లుండి అక్కడక్కడ తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ రోజు ఉపరితల ఆవర్తనం ఉత్తర అండమాన్ సముద్రం దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతూ సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు.

ఈ ఆవర్తనం ప్రభావంతో ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంలో రాగల 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ప్రకటించారు. ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ.. 22 ఉదయానికి మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందన్నారు. ఆ తర్వాత క్రమంగా బలపడుతూ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.