ETV Bharat / city

TOP NEWS: టాప్ న్యూస్ @ 7PM

author img

By

Published : Jun 16, 2022, 6:59 PM IST

7PM
7PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

  • యూనిఫాంను ఎలా గౌరవించాలో మాకు తెలుసు: రేణుకా చౌదరి

పంజాగుట్ట ఎస్​ఐ కాలర్​ పట్టుకొని దురుసుగా ప్రవర్తించిన ఘటనలో రేణుకా చౌదరిపై కేసు నమోదైంది. ఐపీసీ 353 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్ట్ అనంతరం గోల్కొండ పీఎస్​లో ఉన్న రేణుకా చౌదరి తనను పోలీసులు వెనక నుంచి తీసినప్పుడు కిందపడే క్రమంలో ఎస్​ఐ భుజాన్ని పట్టుకున్నానని వివరణ ఇచ్చారు.

  • సాయి పల్లవిపై పీఎస్​లో ఫిర్యాదు.. ఎందుకంటే?

విరాటపర్వం సినిమాలో నటించిన సినీనటి సాయి పల్లవిపై హైదరాబాద్‌ సుల్తాన్‌బజార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమాతో పాటు గోరక్షకులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని భజరంగ్‌దళ్‌ నాయకులు ఆరోపిస్తున్నారు.

  • 'తెలంగాణ బిగ్ గ్రీన్‌స్పాట్‌గా మారింది'

తెలంగాణలో హరితహారం కార్యక్రమం ఆశ్చర్యం కలిగిస్తోందని సద్గురు జగ్గీ వాసుదేవ్‌ అన్నారు. ప్రస్తుతం హైదరాబాద్​ చూస్తుంటే అంతా పచ్చదనం పరిచినట్లుగా కనిపిస్తోందని తెలిపారు.

  • సముద్రంలో నలుగురు చిన్నారుల గల్లంతు..!

బాపట్ల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సరదాగా సముద్రం చూసేందుకు నిజాంపట్నం వచ్చిన నలుగురు చిన్నారులు అలల తాకిడికి కొట్టుకుపోయారు. వీరిలో ఒక పాప మృతదేహం లభ్యమైంది.

  • భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. 15 కిలోల బాంబులు స్వాధీనం

జమ్ముకశ్మీర్​ పుల్వామా జిల్లాలోని ఓ తోట​లో ఉగ్రవాదులు పెట్టిన 15 కిలోల ఐఈడీని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మరోవైపు.. కుల్గాం జిల్లాలో జరిగిన ఎన్​కౌంటర్​లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

  • బొట్టు బిళ్లలతో 100 అడుగుల పెయింటింగ్..

రెండు రోజుల పర్యటన కోసం శుక్రవారం గుజరాత్ వెళ్లనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వినూత్నంగా స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు పలువురు మహిళలు. అందుకోసం బొట్టు బిళ్లలు(స్టిక్కర్లు)తో 100 అడుగుల పొడవైన పెయింటింగ్​ను సిద్ధం చేశారు.

  • భారత్​లో పబ్​జీకి 'ఒలింపిక్స్' గుర్తింపు!.. నిజమెంత?

భారత్​లో విపరీతమైన ఆదరణ ఉన్న ఆన్​లైన్​ గేమ్​ పబ్​జీకి బానిసలుగా చాలా మంది మారిపోతున్నారు. ఆట మోజులో పడి కొందరు దారుణాలకు పాల్పడుతున్నారు. అందువల్లే కొన్నేళ్ల క్రితం భారత్..​ ఈ గేమ్​పై నిషేధం విధించింది.

  • ప్రయాణికులకు షాక్.. 'టికెట్ రేట్లు 15% పెంపు!'..

విమాన ఇంధన ధరలు 16 శాతం మేర పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధర జీవితకాల గరిష్ఠానికి చేరింది. ఈ ప్రభావాన్ని తగ్గించుకునేందుకు విమానయాన సంస్థలు.. టికెట్ల ధరలను పెంచాలని కోరుతున్నాయి.

  • అక్కడ లీటర్​ పెట్రోల్​ రూ.234, డీజిల్​ రూ.263

ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్​లో పెట్రోల్​ ధరలు భగ్గుమంటున్నాయి. ఇరవై రోజుల క్రితమే లీటర్​ పెట్రోల్​పై రూ.60 పెంచిన ప్రభుత్వం మరోసారి రూ.24 వడ్డించింది. దీంతో లీటర్​ పెట్రోల్​ రూ.234కు చేరింది. రాయితీలను పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు స్పష్టం చేసింది.

  • మరోసారి లవర్​బాయ్​గా చైతూ అదుర్స్​..

కొత్త సినిమాల అప్డేట్లు వచ్చేశాయి. నాగ చైతన్య కథానాయకుడిగా నటిస్తున్న 'థ్యాంక్‌ యూ', కిరణ్‌ అబ్బవరం 'సమ్మతమే', సమంత 'యశోద' చిత్రాల విశేషాలు ఇందులో ఉన్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.