ETV Bharat / city

AP and TS: తెలుగు రాష్ట్రాల నియోజకవర్గాల పునర్విభజన అప్పుడే!

author img

By

Published : Aug 3, 2021, 1:37 PM IST

Updated : Aug 3, 2021, 3:22 PM IST

The Center government informed the Parliament that after 2031, the constituencies of the Telugu states will be redistributed
2031 తర్వాతే తెలుగు రాష్ట్రాల నియోజకవర్గాల పునర్విభజన: కేంద్రం

13:34 August 03

2031 తర్వాతే తెలుగు రాష్ట్రాల నియోజకవర్గాల పునర్విభజన: కేంద్రం

తెలుగు రాష్ట్రాల్లో (Telugu states)నియోజకవర్గాల పునర్విభజన 2031 తర్వాతే ఉంటుందని కేంద్ర ప్రభుత్వం (Center government ) స్పష్టం చేసింది. అసెంబ్లీ నియోజకవర్గాల (Assembly constituencies) పెంపుపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (tpcc chief revanth reddy) లోక్‌సభలో ప్రశ్న లేవనెత్తారు. 'ఏపీ విభజన చట్టం ప్రకారం తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 119 నియోజకవర్గాలను 153 నియోజకవర్గాలుగా పెంచాల్సిన అవరం ఉంది. ఎప్పుడు పెంచుతారు?' అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

రేవంత్ రెడ్డి ప్రశ్నకు కేంద్ర సహాయమంత్రి నిత్యానంద్ రాయ్ (Union Minister Nityanand Rai) సమాధానం ఇచ్చారు. రాజ్యంగంలోని ఆర్టికల్ 170లో చెప్పినట్లు 2026 తర్వాత ప్రచురించే జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని నిత్యానంద్ రాయ్ తెలిపారు. నియోజక వర్గాల పునర్విభజన జరిగితే ఏపీలో ప్రస్తుతం ఉన్న 175 నియోజక వర్గాలను 225కు పెంచుతారు. అలాగే తెలంగాణలోని 119 నియోజకవర్గాలను 153కు పెంచుతారు.

ఇవీ చూడండి:


 


 

Last Updated : Aug 3, 2021, 3:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.