ETV Bharat / city

TOP NEWS: టాప్​ న్యూస్ @ 1PM

author img

By

Published : Feb 1, 2022, 12:57 PM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana top news
టాప్​ న్యూస్ @ 1PM

  • 'దేశంలో ఎక్కడి నుంచైనా భూ రిజిస్ట్రేషన్!​'

Union budget 2022: దేశంలో ఎక్కడి నుంచైనా భూములు రిజిస్ట్రేషన్​ చేసుకునేందుకు సరికొత్త వ్యవస్థను తీసుకురానున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ వెల్లడించారు. అలాగే ఈ-పాస్​పోర్టుల జారీ కోసం కొత్త సాంకేతికతను ఉపయోగించనున్నట్లు చెప్పారు.

  • 'మూడేళ్లలో 400 వందే భారత్ రైళ్లు'

Union Budget 2022: కేంద్ర బడ్జెట్​ -2022ను పార్లమెంటు ముందుకు తీసుకొచ్చారు విత్త మంత్రి నిర్మలా సీతారామన్​. వచ్చే మూడేళ్లలో 400 వందే భారత్​ రైళ్లను తీసుకురానున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా పీఎం గతిశక్తి కార్యక్రమం ద్వారా 100 కార్గో టర్మినళ్లను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.

  • వాటిపై తప్పని నిరాశ

2022-23 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభకు సమర్పించారు. దాదాపు గంటన్నరకు పైగా సాగిన ఆర్థికమంత్రి బడ్జెట్‌ ప్రసంగంలో ఎక్కడ ఆదాయపన్ను తగ్గుదల ప్రస్తావన రాలేదు.

  • పోలీసు కస్టడీకి హైకోర్టు నిరాకరణ

Hyderabad Drugs Case update : డ్రగ్స్ కేసులో వ్యాపారులను పోలీసు కస్టడీకి ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. 9 మంది నిందితులను కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల పిటిషన్ కొట్టివేసింది. అంతకుముందు కస్టడీకి అప్పగించేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించగా.. తీర్పును సవాల్ చేస్తూ పోలీసులు దాఖలు చేసిన అప్పీలును హైకోర్టు ఇవాళ కొట్టివేసింది.

  • మోదీనే నెం.1.. తగ్గేదేలె..!

PM Modis Youtube Channel: ప్రధాని నరేంద్ర మోదీ యూట్యూబ్ ఛానల్ తాజాగా కోటి సబ్‌స్క్రిప్షన్‌లను దాటింది. ప్రపంచ అగ్రశ్రేణి నాయకుల్లో అత్యధిక సబ్​స్క్రైబర్​లను కలిగిన రికార్డ్​ను మోదీ సాధించారు.

  • 'భారత్​కు సొంత డిజిటల్ కరెన్సీ'

Digital Rupee India: రూపాయికి మరింత బలాన్ని చేకూర్చేలా డిజిటల్‌ రూపీ తీసుకొస్తామన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. 2022-23 ఆర్థిక సంవత్సరం నుంచి ఆర్​బీఐ డిజిటల్ రూపీని జారీ చేస్తుందని వెల్లడించారు.

  • వారెవా.. గజరాజుతో చిన్నారి దోస్తీ!

అసోంలో మూడేళ్ల చిన్నారి గజరాజుతో ఆటలాడుకుంటోంది. రోజూ ఏనుగుకు కావాల్సిన ఆహారం అందిస్తూ మచ్చిక చేసుకుని.. ఖాళీ సమయాల్లో గజరాజుపైకి ఎక్కి సరదాగా తిరుగుతోంది. చిన్నారి హర్షిత గజరాజుతో ఆడుకునే వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

  • మార్కెట్లలో 'బడ్జెట్'​ జోరు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ బడ్జెట్​ ప్రసంగం ముగిసింది. ఈ నేపథ్యంలో దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు లాభాల్లో పయనిస్తున్నాయి. సెన్సెక్స్​ 900 పాయింట్లకుపైగా లాభంతో.. 58 వేల 933 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 250 పాయింట్లు పెరిగి.. 17 వేల 580 ఎగువన కొనసాగుతోంది

  • చిరంజీవితో తమిళ బ్యూటీ!

Chiranjeevi Venkikudumula movie: మెగాస్టార్​ చిరంజీవి-వెంకీ కుడుముల కాంబోలో తెరకెక్కనున్న సినిమాలో తమిళ హీరోయిన్​ మాళవిక మోహనన్​ను ఎంపిక చేయాలని చిత్రబృందం భావిస్తోందట. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది.

  • 'అతని​ కోసం ఫ్రాంచైజీలు పోటీపడతాయి'

Deepak chahar IPL: దీపక్‌ చాహర్‌పై ప్రశంసలు కురిపించాడు టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా అన్నాడు. మెగావేలంలో అతడిని కొనుగోలు చేయడానికి చెన్నై సూపర్ కింగ్స్‌తో సహా అన్ని ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపుతాయని పేర్కొన్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.