ETV Bharat / city

TOP NEWS IN TS: టాప్ న్యూస్ @9PM

author img

By

Published : Aug 10, 2022, 8:58 PM IST

TOP NEWS IN TS
టాప్ న్యూస్

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

  • సీజేఐగా జస్టిస్​ ఉమేశ్​ లలిత్​

సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్‌ న్యాయమూర్తి అయిన జస్టిస్‌ యు.యు.లలిత్‌ (ఉదయ్‌ ఉమేశ్‌ లలిత్‌) భారత దేశ 49వ ప్రధాన న్యాయమూర్తిగా (సీజేఐ) బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఇటీవలే జస్టిస్​ లలిత్ పేరును కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎన్​వీ రమణ.

  • రిజర్వేషన్ల అంశంపై సుప్రీం నోటీసులు

ఎస్సీ వర్గీకరణ, రిజర్వేషన్ల అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్లు అమలు చేయాలని సర్వోన్నత న్యాయస్థానంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పిటిషన్​ దాఖలు చేయగా.. నేడు విచారణ చేపట్టింది.

  • బిహార్ సీఎంగా నీతీశ్.. ఎనిమిదో సారి ప్రమాణం

Bihar CM Nitish kumar: బిహార్ ముఖ్యమంత్రిగా జనతాదళ్ నేత నీతీశ్ కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. రాజ్​భవన్​లో గవర్నర్ ఫాగూ చౌహాన్.. నీతీశ్​తో ప్రమాణం చేయించారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే 2024 ఎన్నికల్లో తాను ప్రధాని పదవికి రేసులో లేనని నీతీశ్​ స్పష్టం చేశారు. అయితే కొత్త ప్రభుత్వం పదవీ కాలం పూర్తికాకుండానే పతనమవుతుందని భాజపా నేత సుశీల్​ మోదీ జోస్యం చెప్పారు.

  • నుపుర్​ శర్మకు ఊరట.. ఆ కేసులన్నీ దిల్లీకి బదిలీ

Nupur Sharma news: భాజపా మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మకు సుప్రీంకోర్టులో కాస్త ఊరట లభించింది. మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి నుపుర్‌ శర్మపై దాఖలైన అన్ని ఎఫ్ఐఆర్​లను దిల్లీ పోలీసులకు బదిలీచేయాలని సుప్రీం ఆదేశించింది.

  • ప్రేమోన్మాది అరెస్ట్

నిన్న నల్గొండలో ఫారెస్ట్ పార్క్‌లో అమ్మాయిపై హత్యాయత్నం కేసులో ప్రేమోన్మాది మీసాల రోహిత్​ను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి వెల్లడించారు. గతంలోనూ నిందితుడు బాధితురాలిని సీసాతో బెదిరించాడని చెప్పారు.

  • ఫీల్డ్ అసిస్టెంట్లకు గుడ్​న్యూస్​

ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లు మళ్లీ విధుల్లో చేరనున్నారు. నేటి నుంచే ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు కలెక్టర్లు, జిల్లా అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు.

  • 'ఆ మాత్రం రేవంత్‌రెడ్డికి తెల్వదా..' పాల్వాయి స్రవంతి ఆడియో వైరల్‌!

palvai sravanthi audio viral: మునుగోడు ఉపఎన్నికతో రాష్ట్రంలో ఎన్నికలవేడి మొదలైంది. అయితే ఇదిలా ఉండగా పాల్వాయి స్రవంతి ఆడియో కాంగ్రెస్‌లో కలకలం రేపుతోంది. సామాజిక మాధ్యామాల్లో స్రవంతి ఆడియో హల్‌చల్‌ చేస్తోంది.

  • ఎల్లుండి ఎంసెట్​ ఫలితాల విడుదల..!

EAMCET Results 2022: రాష్ట్రంలో ఎంసెట్​ ఫలితాల విడుదలకు ముహుర్తం దాదాపుగా ఖరారైంది. ఈ నెల 12న లేదా 13న ఫలితాలు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. అయితే.. ఎంసెట్​ కమిటీ రేపు ఫలితాలను విశ్లేషించి ఆమోదించనుంది. ఆ తరువాత ఫలితాల ప్రకటనే..

  • విమాన టికెట్ ధరలకు ఇక రెక్కలు!

Airfare bands: దేశీయ మార్గాల్లో విమాన ఛార్జీలపై పరిమితులను తొలగించింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా బుధవారం ట్విట్టర్​ వేదికగా వెల్లడించారు. ఈ నిర్ణయం ఆగస్టు 31న అమల్లోకి రానుందని తెలిపారు.

  • సూర్య జోరు.. కెరీర్​లోనే అత్యుత్తమ ర్యాంక్​

ICC Rankings Surya kumar yadav: ఐసీసీ విడుదల చేసిన తాజా టీ-20 ర్యాకింగ్స్‌లో టీమ్‌ఇండియా ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ అదరగొట్టాడు. కెరీర్​లోనే అత్యుత్తమ ర్యాంక్​కు చేరుకున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.