ETV Bharat / city

అనుమతులు లేని ఆ పనులను నిలువరించాలి: కేఆర్‌ఎంబీకీ తెలంగాణ ఈఎన్సీ లేఖ

author img

By

Published : Oct 14, 2022, 10:16 PM IST

Telangana letter to KRMB: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అనుమతులు లేకుండా కృష్ణా నదిపై ప్రాజెక్టుల విస్తరణ పనులు చేస్తోందని తెలంగాణ ఆరోపించింది. ఈ మేరకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు లేఖ రాసింది. ఈ ప్రాజెక్టులు అమలు కాకుండా నిలువరించాలని లేఖలో కోరింది.

Krishna River Management Board
కృష్ణా బోర్డు

Telangana letter to KRMB: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతుల్లేకుండా చేపడుతున్న తెలుగు గంగ, హంద్రీనీవా ప్రాజెక్టుల విస్తరణ, కొత్త పనులను నిలువరించాలని తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బోర్డును కోరింది. ఈ మేరకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్‌కు తెలంగాణ నీటి పారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్ లేఖ రాశారు. ఎలాంటి అనుమతుల్లేకుండా హంద్రీనీవా సుజలస్రవంతి రెండో దశలో భాగంగా పుంగనూరు బ్రాంచ్ కెనాల్ విస్తరణ పనులకు ఏపీ టెండర్‌ నోటిఫికేషన్ ఇచ్చిందని అందులో పేర్కొన్నారు.

తెలుగు గంగ ప్రాజెక్టు ఐదో బ్రాంచ్ కెనాల్‌పై మినీ లిఫ్ట్‌ ఏర్పాటుకు, చింతల్ ఆత్మకూరు చెరువు నింపేందుకు మరో మినీ లిఫ్ట్‌ ఏర్పాటుకు కూడా టెండర్లు పిలిచారని తెలిపారు. ఈ పనులన్నీ విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తూ కొత్తగా చేపట్టిన పనులేనని లేఖలో ఈఎన్‌సీ పేర్కొన్నారు. ఈ అంశాలన్నీ పరిశీలించి అనుమతులు లేకుండా తెలుగు గంగ, హంద్రీనీవా ప్రాజెక్టులకు సంబంధించి విస్తరణ, కొత్త పనులు చేపట్టకుండా ఏపీని నిలువరించాలని కృష్ణా బోర్డును తెలంగాణ కోరింది. ఉల్లంఘనలన్నింటినీ కేంద్ర జలశక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేసింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.