ETV Bharat / city

Dharani : భూసమస్యల పరిష్కారానికి 5 రోజులపాటు ప్రత్యేక డ్రైవ్

author img

By

Published : Jun 1, 2021, 12:38 PM IST

Updated : Jun 1, 2021, 1:35 PM IST

dharani
dharani

12:35 June 01

Dharani :భూసమస్యల పరిష్కారానికి 5 రోజులపాటు ప్రత్యేక డ్రైవ్

ధరణి (Dharani) పోర్టల్ ద్వారా వచ్చిన భూసమస్యల విజ్ఞప్తులు, సమస్యల పరిష్కారం కోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు. రైతుబంధు సాయాన్ని ఈ నెల రోజుల 15వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. పార్ట్ బీ నుంచి పార్ట్ ఏలో చేరిన భూములకు రైతుబంధు సాయం అందించేందుకు కటాఫ్ తేదీని పదిగా నిర్ణయించారు. 

దీంతో పెండింగ్​లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో వాటి పరిష్కారం కోసం ఐదు రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని కలెక్టర్లను సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశించారు. రోజుకు 20శాతం చొప్పున ఐదు రోజుల పాటు అన్ని పెండింగ్ కేసులను పరిష్కరించాలని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి : మంత్రి కేటీఆర్ ట్విటర్​కు భూసమస్యల వినతులు

Last Updated : Jun 1, 2021, 1:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.