ETV Bharat / city

TET File in CM office: సీఎం కార్యాలయానికి టెట్‌ దస్త్రం

author img

By

Published : Mar 20, 2022, 9:13 AM IST

TET File in CM office
సీఎం కార్యాలయానికి టెట్‌ దస్త్రం

TET File in CM office : ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) దస్త్రం తాజాగా సీఎం కార్యాలయానికి చేరింది. మరోపక్క టెట్‌లో ఒకసారి అర్హత సాధిస్తే ఆ స్కోర్‌కు ఏడేళ్లకు బదులు జీవితాంతం విలువ ఉంచాలని, బీఈడీ అభ్యర్థులకు పేపర్‌-1 రాసే అవకాశం ఇచ్చేలా జీవో ఇవ్వాలంటూ అధికారులు ప్రతిపాదించారు. ఈ మార్పులతోపాటు టెట్‌ను నిర్వహించాలంటే ప్రభుత్వం ఆమోదం తెలపాలి.

TET File in CM office : ఉపాధ్యాయుల నియామకానికి ముందు నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) దస్త్రం తాజాగా సీఎం కార్యాలయానికి చేరింది. బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులు ప్రాథమిక పాఠశాలల్లో బోధించేందుకు టెట్‌లో పేపర్‌-1ను రాసేందుకు అవకాశం ఇవ్వాలని, ఒకసారి టెట్‌లో అర్హత సాధిస్తే ఇప్పటివరకు ఉన్న ఏడేళ్ల కాలపరిమితికి బదులు జీవితాంతం విలువ ఉండేలా మార్పు చేయాలని పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదించింది. ఈ మార్పులతోపాటు టెట్‌ను నిర్వహించాలంటే ప్రభుత్వం ఆమోదం తెలపాలి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆమోదం కోసం విద్యాశాఖ ఆ దస్త్రాన్ని మూడు రోజుల క్రితం సీఎం కార్యాలయానికి పంపింది. టెట్‌లో వచ్చే మార్కులకు ఉపాధ్యాయ నియామకాల్లో భాగంగా నిర్వహించే పరీక్షల్లో 20 శాతం వెయిటేజీ ఇచ్చి ర్యాంకు కేటాయిస్తారు.

సీఎంకు సీఎస్‌ నివేదిక

TET Notification : తెలంగాణలో ఉద్యోగ నియామకాల ప్రక్రియపై సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ శనివారం సీఎం కేసీఆర్‌కు నివేదిక ఇచ్చారు. శాఖలవారీగా సన్నద్ధత, నియామక సంస్థల గుర్తింపు తదితర వివరాలు అందులో పేర్కొన్నారు. జీవోల జారీ ప్రక్రియ చేపట్టామని, అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి జీవోను జారీచేశామని తెలిపారు.

ఇదీ చదవండి:స్టడీ సర్కిళ్లలో డిజిటల్‌ శిక్షణ.. త్వరలో తరగతుల ప్రారంభం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.