ETV Bharat / city

ప్లాస్టిక్​ కవర్లతో రండి.. మొక్కలు తీసుకెళ్లండి

author img

By

Published : Nov 22, 2019, 6:24 AM IST

Updated : Nov 22, 2019, 10:02 AM IST

అతనో పర్యావరణ ప్రేమికుడు.. భాగ్యనగరాన్ని పర్యావరణ హితంగా చేయాలని తలచాడు. ప్లాస్టిక్​ వాడకాన్ని నివారించేందుకు ముందుకు కదిలాడు. తనొక్కడినే చేయగలనా అనే సందేహాలు పెట్టుకోలేదు. ఎవరి సాయమూ తీసుకోలేదు. స్వయంగా నర్సరీని ఏర్పాటు చేసి ఉచితంగా మొక్కలు పంపిణీ చేస్తున్నాడు.  'ప్లాస్టిక్​ కవర్లతో రండి.. మీకు నచ్చిన పూల మొక్కలను తీసుకెళ్లండి' పేరిట వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు.

hyderabad men work for environment

చేతి నిండా ప్లాస్టిక్​తో రండి.. మొక్కలు తీసుకెళ్లండి

ప్లాస్టిక్​ను నివారించాలని.. పర్యావరణాన్ని కాపాడాలని.. ఇలా ఎవరు చెప్పినా వింటాం. పది మందికి చెప్తాం. కానీ మనమే పాటించం. మన ఒక్కరి వల్ల ఏమవుతుందిలే అనుకుంటాం. యథేచ్ఛగా ప్లాస్టిక్​ను వాడేస్తాం. కానీ హైదరాబాద్​ ఎల్బీనగర్​లోని రాక్​టౌన్​ కాలనీలో నివాసం ఉంటున్న దోసపాటి రాము అలా అనుకోలేదు. తన వంతు పర్యావరణానికి మేలు చేయాలని... కొంతమందిలోనైనా మార్పు తీసుకురావాలని తలచాడు.

చేతి నిండా ప్లాస్టిక్​తో రండి..

రోజు రోజుకు పెరిగిపోతున్న ప్లాస్టిక్​ వినియోగాన్ని తగ్గించేలా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నడుం బిగించాడు. ఇప్పటికే వినియోగించిన ప్లాస్టిక్​ను వెనక్కి తీసుకొచ్చేందుకు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. హైదరాబాద్​ ఎల్బీనగర్​ నుంచి నాగోల్​ వెళ్లే రహదారిలో నర్సరీని ఏర్పాటు చేశాడు. 'ప్టాస్టిక్​ కవర్లతో రండి.. మీకు నచ్చిన పూల మొక్కలను తీసుకెళ్లండి' పేరిట వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. పూణె నుంచి మొక్కలు తీసుకొచ్చి ఉచితంగా పంపిణీ చేస్తున్నాడు.

రాము చేపట్టిన పర్యావరణ పరిరక్షణ కార్యక్రమానికి ప్రజల నుంచి సైతం మంచి స్పందన వచ్చింది . సమీపంలో నివసించే వారెందరో అక్కడకు వచ్చి నచ్చిన మొక్కలను తీసుకెళ్తూ రామును అభినందిస్తున్నారు.

ఇప్పటి వరకు సుమారు వెయ్యికి పైగా మొక్కలు పంపిణీ చేశామని రాము చెప్పాడు. మహానగరాన్ని కాలుష్యం బారి నుంచి కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకురావాలని కోరాడు. ప్లాస్టిక్​ వాడకాన్ని నివారించి.. విరివిగా మొక్కలు పెంచాలని నగరవాసులను కోరుతున్నాడు.

ఇవీచూడండి: 'చివరి శ్వాస వరకు ఉచితంగా వైద్యం అందిస్తా...'

Intro:Tg_Hyd_01_22_Awareness on Plastic_PKG_TS10012


Body:Tg_Hyd_01_22_Awareness on Plastic_PKG_TS10012


Conclusion:Tg_Hyd_01_22_Awareness on Plastic_PKG_TS10012
Last Updated : Nov 22, 2019, 10:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.