ETV Bharat / city

బడి బస్సుల్లో భయం.. రిపేర్ చేయించకుండానే రోడ్డెక్కిస్తున్నారు

author img

By

Published : Jul 9, 2022, 7:07 AM IST

School Bus Fitness : కరోనా కారణంగా రెండేళ్లు బడికి మూతపడింది. ఫలితంగా స్కూల్ బస్సులు మూలకు పడ్డాయి. మళ్లీ పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. బస్సులు షెడ్డు నుంచి రోడ్డెక్కాయి. కానీ రెండేళ్లు షెడ్డులకే పరిమితమైన బస్సులకు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయించకుండానే మళ్లీ రోడ్డెక్కిస్తున్నారు. ఈ క్రమంలో బడి బస్సుల భద్రతపై విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.

School Bus Fitness
School Bus Fitness

School Bus Fitness : బడి బస్సుల భద్రతపై తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ లేకుండానే పిల్లల్ని ఎక్కించుకెళుతున్నారని వాపోతున్నారు. కరోనా కారణంగా గత రెండేళ్లు షెడ్డులకే పరిమితమైనా పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయించకుండానే తిప్పేస్తున్నారని ఆరోపిస్తున్నారు. చాలా బస్సుల్లో బ్రేకుల వ్యవస్థ సరిగాలేదని.. కొన్నింటి కండిషన్‌ బాగాలేదని చెబుతున్నారు. స్కూళ్లు/కాలేజీలు ప్రారంభించిన తొలి రోజుల్లో రవాణా శాఖ అధికారులు తూతూమంత్రంగా దాడులు చేసి 170 వరకు బస్సులను సీజ్‌ చేశారని, పూర్తిస్థాయిలో తనిఖీలు చేపట్టాలని కోరుతున్నారు. ఏటా మే మొదటి వారం నాటికే ధ్రువపత్రం తీసుకొనేవారు.

కారణమేంటి... కరోనా నేపథ్యంలో 2020 నుంచి బడి బస్సులు రోడ్డెక్కలేదు. ఈ విద్యా సంవత్సరం నుంచే విద్యాసంస్థలు బస్సులను పూర్తిస్థాయిలో నడుపుతున్నాయి. ఈసారి ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ కోసం రవాణా శాఖ వద్దకు వచ్చిన యాజమాన్యాలకు కొత్త చిక్కు వచ్చిపడింది. గత రెండేళ్లలో ఎన్ని రోజులకైతే ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ తీసుకోలేదో అన్ని రోజులకు రోజుకు రూ.50 చొప్పున జరిమానా చెల్లించాలని రవాణా శాఖ ఆదేశించింది.

School Bus Fitness Issues : తలకుమించి భారం కావడంతో కొన్ని విద్యాసంస్థలు హైకోర్టును ఆశ్రయించాయి. రోజుకు రూ.10 చొప్పున చెల్లించి సర్టిఫికెట్‌ తీసుకోవాలని సూచించడంతో ఆమేరకు చెల్లించి ధ్రువపత్రాలు పొందారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో కలిపి ఇంకా 5000 వరకు బస్సులు ఫిట్‌నెస్‌ చేయించుకోవాల్సి ఉంది. వర్షాకాలంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేపట్టి ఫిట్‌నెస్‌ లేని బస్సులను నిరోధించాలని, లేదంటే మరమ్మతులు చేయించుకొనేలా చూడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

మూడు జిల్లాల గణాంకాలు..

  • స్కూళ్లు/కాలేజీల బస్సులు 13000
  • రంగారెడ్డి జిల్లాలో 5500
  • ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ తీసుకున్నవి 3500
  • హైదరాబాద్‌, మేడ్చల్‌ జిల్లాలో
  • ఫిట్‌నెస్‌ చేయించుకోని బస్సులు 3 వేలు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.