ETV Bharat / city

ఆర్పీఎఫ్​ మహిళా కానిస్టేబుల్ తొలిబ్యాచ్ పాసింగ్​ఔట్ పరేడ్

author img

By

Published : Aug 17, 2020, 7:28 PM IST

RPF women constable first batch passing out parade in Hyderabad
ఆర్పీఎఫ్​ మహిళా కానిస్టేబుల్ తొలిబ్యాచ్ పాసింగ్​ఔట్ పరేడ్

ఆర్పీఎఫ్​ మహిళా కానిస్టేబుల్ మొదటి బ్యాచ్​ క్యాడెట్స్ పాసింగ్​ఔట్ పరేడ్​ హైదరాబాద్​ మౌలాలీలోని 7వ బెటాలియన్ రైల్వే ప్రొటెక్షన్​ స్పెషల్​ ఫోర్స్ అనుబంధ శిక్షణాకేంద్రంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్​సీఆర్​ జనరల్​ మేనేజర్ గజానన్​ మాల్యా హాజరయ్యారు.

ఆర్పీఎఫ్​ మహిళా కానిస్టేబుల్ మొదటి బ్యాచ్​ క్యాడెట్స్ పాసింగ్​ఔట్​ పరేడ్​ హైదరాబాద్​ మౌలాలీలో జరిగింది. 7వ బెటాలియన్ ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ అనుబంధ శిక్షణాకేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎస్​సీఆర్​ జనరల్​ మేనేజర్ గజానన్ మాల్యా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

శిక్షణా సమయంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన మహిళా క్యాడెట్లను జీఎం ప్రశంసించారు. క్యాడెట్లంతో నిబద్ధత, అంకితభావంతో విధులు నిర్వర్తిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం వారికి మెడల్స్, సర్టిఫికెట్​ ఆఫ్ ఎక్సలెన్స్​ను అందించారు.

ఆర్పీఎస్​ఎఫ్​ శిక్షణాకేంద్రాన్ని ఆర్పీఎఫ్ అనుబంధ శిక్షణా కేంద్రంగా మార్చడమే గాక ప్రత్యేకంగా మహిళల బ్యాచ్​కు మొదటిసారిగా శిక్షణ ఇచ్చే బాధ్యతను చేపట్టిన వారిని జీఎం గజానన్ అభినందించారు. భారత రైల్వేలోని 14 మండలాలకు చెందిన 298 ఆర్పీఎఫ్​ మహిళా కానిస్టేబుల్ క్యాడెట్లు విధులు నిర్వర్తించేందుకు సిద్ధమయ్యారు. కరోనా కారణంగా ఈ కార్యక్రమాన్ని క్యాడెట్ల కుటుంబ సభ్యులు ఆన్​లైన్​లో వీక్షించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.