ETV Bharat / city

rgv vs manchu manoj: ఆర్జీవీ.. మీరూ సిని'మా' సర్కస్​లో భాగమే..!

author img

By

Published : Oct 25, 2021, 5:04 PM IST

'మా' ఎన్నికలు ముగిసిప్పటికీ.. ఆ వేడి మాత్రం తగ్గడం లేదు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, మంచు మనోజ్ మధ్య ట్విట్టర్​ వేదికగా ఒకరికొకరు కౌంటర్లు ఇచ్చుకుంటున్నారు. అవి కాస్తా వైరల్​ అవుతూనే ఉన్నాయి.

rgv vs manchu manoj
rgv vs manchu manoj

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, హీరో మంచు మనోజ్ మధ్య ట్వీట్​ వార్​ కొనసాగుతోంది. 'మా' ఎన్నికలు ముగిసిప్పటికీ.. వీరిద్దరి మధ్య ఆ వేడి మాత్రం తగ్గడం లేదు. తాజాగా వీరు చేసిన ట్వీట్లు ప్రస్తుతం నెట్టింట వైరల్​గా మారాయి.

అసలేం జరిగింది?:

'మా' సభ్యుల తీరుపై అసహనం వ్యక్తం చేసిన ఆర్జీవీ(ram gopal varma).. 'మా' ఒక సర్కస్ అని.. అందులోని సభ్యులు జోకర్లు.. అంటూ ఓ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ కాస్తా వైరల్​గా మారగా.. దీనికి గట్టిగా బదులిచ్చారు నటుడు మంచు మనోజ్(manchu manoj). ''మా' సర్కస్ అయితే మీరు అందులో రింగ్ మాస్టర్' అంటూ రిప్లై ఇచ్చారు.

అయితే దీనిపై తాజాగా రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ.. 'నేను రింగ్​ మాస్టర్​ను కాను. సర్కస్​లో వినోదాన్నిచ్చే కోతిని మాత్రమే' అంటూ ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన మనోజ్.. విన్యాసాలతో సంబంధం లేకుండా మనమంతా ఒకే సర్కస్‌కు చెందిన వాళ్లం సార్​.. అంటూ రిప్లై ఇచ్చారు.

ఇదీ చూడండి: ఆర్జీవీకి మంచు మనోజ్ స్ట్రాంగ్ కౌంటర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.