ETV Bharat / city

సోనూసూద్​పై అభిమానం.. అద్దంలో చూస్తూ ఉదరంపై చిత్రలేఖనం!

author img

By

Published : May 26, 2021, 10:53 PM IST

sonusood
సోనూసూద్​పై అభిమానం

చేతితో.. కాలితో.. లేదా నాలుకతో ఇలా రకరకాల ప్రయత్నాల్లో అద్భుతమైన ప్రతిభ చాటిన చిత్రకారులు ఎందరో ఉన్నారు. కానీ.. అద్దంలో చిత్రాన్ని చూస్తూ.. తన పొట్టపై చిత్రలేఖనం చేసి.. అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు విశాఖ జిల్లాకు చెందిన వినోద్. అదికూడా.. ఎంతో మందిని ఆపదలో ఆదుకుంటున్న సోనూసూద్ చిత్రాన్ని గీసి.. శెభాష్ అనిపించుకున్నాడు.

నటుడు సోనూసూద్‌పై ప్రజల్లో నెలకొన్న అభిమానం, ఆదరణ, కృతజ్ఞతా భావం రోజూ ఏదో ఒక రూపంలో బయటపడుతూనే ఉంది. విశాఖ జిల్లా నర్సీపట్నం సమీపంలోని బాలిఘట్టం గ్రామానికి చెందిన చిత్రలేఖన కళాకారుడు వినోద్.. అద్దంలో చూస్తూ తన పొట్టపై సోనూసూద్‌ బొమ్మను గీశాడు.

గతేడాది లాక్‌డౌన్‌ నుంచి ఇంట్లోనే ఉంటూ కాలితో, నాలుకతో బొమ్మలు వేయడం ప్రారంభించిన వినోద్.. ఎంతో మంది దేశ నాయకులు, సినీ నటులు, హీరోల చిత్రాలకు జీవం పోశాడు. సామాజిక మాధ్యమాల్లో ఓ చిత్రకారుడిని చూసి స్ఫూర్తి పొంది.. అద్దంలో చూస్తూ ఉదరంపై చిత్రాలు గీయడం నేర్చుకున్నాడు. ఈ క్రమంలోనే.. సోనూసూద్ చిత్రాన్ని ఇలా గీసి.. అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు.

సోనూసూద్​పై అభిమానం

ఇవీచూడండి: డేటింగ్​ యాప్​లో నటి గీతాంజలి ఫొటోలు.. పోలీసులకు ఫిర్యాదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.