ETV Bharat / city

స్వల్ప మార్పులతో దుర్గా మల్లేశ్వరస్వామి తెప్పోత్సవం..

author img

By

Published : Oct 14, 2021, 9:18 PM IST

officlas-take-key-decession-on-teppotsavam-at-indrakeeladri
officlas-take-key-decession-on-teppotsavam-at-indrakeeladri

ఏపీలోని బెజవాడ దుర్గా మల్లేశ్వరస్వామి తెప్పోత్సవంలో అధికారులు స్వల్ప మార్పులు చేశారు. దసరా ముగింపు ఉత్సవాల నిర్వహణపై సమన్వయ కమిటీ భేటీ అయింది. కృష్ణా నదిలో రేపు సాయంత్రం ఉత్సవమూర్తులకు యథాతథంగా పూజలు నిర్వహిస్తామని.. పరిమిత సంఖ్యలో అర్చకులతో పూజలు చేపట్టనున్నట్లు ప్రకటిచారు.

స్వల్ప మార్పులతో ఏపీలోని బెజవాడ దుర్గా మల్లేశ్వరస్వామి తెప్పోత్సవం నిర్వహించాలని అధికారుల నిర్ణయించారు. ఈ మేరకు దసరా ముగింపు ఉత్సవాల నిర్వహణపై సమన్వయ కమిటీ భేటీ అయింది. బ్యారేజీలో వరద ఎక్కువగా ఉన్నందున స్వల్ప మార్పులతో తెప్పోత్సవం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. నదిలో విహారం లేకుండా దుర్గా మల్లేశ్వరస్వామి తెప్పోత్సవ కార్యక్రమం చేపడతామని పేర్కొన్నారు. కృష్ణా నదిలో రేపు సాయంత్రం ఉత్సవమూర్తులకు యథాతథంగా పూజలు నిర్వహిస్తామని.. పరిమిత సంఖ్యలో అర్చకులతో పూజలు చేపట్టనున్నట్లు ప్రకటిచారు.

"స్వల్ప మార్పులతో తెప్పోత్సవం నిర్వహించాలని నిర్ణయించాం. బ్యారేజీలో వరద ఎక్కువగా ఉన్నందున విహారం లేకుండా దుర్గా మల్లేశ్వరస్వామి తెప్పోత్సవం నిర్వహిస్తాం. కృష్ణా నదిలో రేపు సాయంత్రం యథాతథంగా పూజలు ఉంటాయి." -నివాస్​, కృష్ణా జిల్లా కలెక్టర్

పటిష్ట ఏర్పాట్లు: నగర సీపీ శ్రీనివాసులు

దసరా సందర్భంగా ఇంద్రకీలాద్రికి అత్యధికంగా భక్తులు తరలివచ్చారని నగర సీపీ శ్రీనివాసులు తెలిపారు. రేపు విజయదశమి రోజున భక్తుల రద్దీ దృష్ట్యా పటిష్ట ఏర్పాట్లు చేపట్టామని.. కనకదుర్గ ఫ్లైఓవర్‌పై వాహనాలను అనుమతించడం లేదని స్పష్టం చేశారు. పరిమిత సంఖ్యలోనే ఘాట్లలో భక్తులను అనుమతిస్తామన్నారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.