ETV Bharat / city

NANDAMURI FAMILY: 'మహిళలను కించపరచడం సరికాదు.. అహంభావం వీడాలి'

author img

By

Published : Nov 20, 2021, 2:25 PM IST

Updated : Nov 20, 2021, 3:57 PM IST

అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై తెదేపా అధినేత చంద్రబాబునాయుడు కంటతడి పెట్టడం ఎంతో బాధ కలిగించిందని నందమూరి కుటుంబసభ్యులు(NANDAMURI FAMILY) అన్నారు. రాజకీయాల్లోకి కుటుంబసభ్యులను తీసుకొస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల పట్ల వైకాపా నేతలు ఎలాంటి సంస్కారంతో ఉన్నారో అందరికీ అర్థమైందని మండిపడ్డారు. ఇప్పటికైనా వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని హితవు పలికారు.

balaiah family members, nandamuru family comments
నందమూరి కుటుంబసభ్యులు, బాలకృష్ణ ఆవేదన

చంద్రబాబుపై వైకాపా నేతల వ్యాఖ్యలను నందమూరి కుటుంబ సభ్యులు(NANDAMURI FAMILY) తీవ్రంగా ఖండించారు. నందమూరి బాలకృష్ణ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నందమూరి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయం లాంటి అసెంబ్లీలో మహిళలను కించపరిచేలా మాట్లాడటం ఏంటన్న బాలకృష్ణ మరో సోదరి లోకేశ్వరి.. అహంభావం విడనాడాలని సూచించారు.

రాజకీయాల్లోకి కుటుంబసభ్యులను తీసుకొస్తారా ? అని వైకాపా నేతలపై నందమూరి సుహాసిని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భువనేశ్వరి ఏనాడు రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదని అన్నారు. రాజకీయాలు రాజకీయంగానే ఉండాలి గానీ...కుటుంబ విషయాల జోలికి తీసుకురావటం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. మహిళలను ఎన్టీఆర్ ఎంతో గౌరవమిచ్చారన్న సుహాసిని.. నిన్న అసెంబ్లీలో జరిగిన ఘటనను అందరూ ఖండించాలని పిలుపునిచ్చారు.

భువనేశ్వరి ఏనాడు రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదు. ఎన్టీఆర్‌ను తెలుగు ప్రజలు అన్నా అని పిలుచుకుంటారు. రాజకీయాల్లో కుటుంబసభ్యులను తీసుకొస్తారా?. తెలుగువారందరూ ఖండించాల్సిన విషయం. మహిళలకు ఎన్టీఆర్‌ ఎంతో గౌరవమిచ్చారు.

- నందమూరి సుహాసిని

అసెంబ్లీలో లేని వ్యక్తులపై మాట్లాడతారా...

మహిళల పట్ల వైకాపా నేతలు ఎలాంటి సంస్కారంతో ఉన్నారో అందరికీ అర్థమైందని గారపాటి శ్రీనివాస్ అన్నారు. రెండేళ్ల కాలంలో ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. ఒక్క అవకాశం ఇస్తే మంచి పాలన చేస్తారని అధికారంలోకి వచ్చి.. ప్రజాసమస్యలపై దృష్టి పెట్టకుండా వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో లేని వ్యక్తులపై మాట్లాడతారా అని మండిపడ్డారు. చంద్రబాబు కన్నీళ్లు పెడుతుంటే చూడలేకపోయానని శ్రీనివాస్‌ అన్నారు. ఇప్పటికైనా వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని ఎన్టీఆర్‌ వారసులుగా హెచ్చరిస్తున్నానన్నారు.

NANDAMURI FAMILY

ఒక్క అవకాశం ఇస్తే మంచి పాలన చేస్తారని అనుకున్నారు. అసెంబ్లీలో లేని వ్యక్తులపై మాట్లాడతారా?. చంద్రబాబు కన్నీళ్లు పెడుతుంటే చూడలేకపోయా. వైకాపా వాళ్లు మహిళల పట్ల ఎలాంటి సంస్కారంతో ఉన్నారో అందరికీ అర్థమైంది. ఇప్పటికైనా వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని హెచ్చరిస్తున్నా - గారపాటి శ్రీనివాస్‌, లోకేశ్వరి కుమారుడు

ఎన్టీఆర్ చాలా పద్ధతిగా పెంచారు..

రాజకీయ లబ్ధి కోసం మహిళలను కించపరిచేలా మాట్లాడతారా అని చైతన్యకృష్ణ మండిపడ్డారు. ఇలా మాట్లాడితే రాజకీయాలకు మహిళలు వస్తారా? అని ప్రశ్నించారు. మహిళల కోసం చంద్రబాబు డ్వాక్రా గ్రూపులు తెచ్చారని గుర్తు చేశారు. మహిళలకు గౌరవమిచ్చే కుటుంబం తమది అని అన్నారు. ఎన్టీఆర్ చాలా పద్ధతిగా పెంచారన్న చైతన్యకృష్ణ... కొడాలి నాని, వల్లభనేని వంశీని బర్తరఫ్‌ చేయాలని డిమాండ్ చేశారు.

చంద్రబాబు బాధపడుతుంటే చూడలేకపోయా. ఎన్టీఆర్‌ చాలా పద్ధతిగా పెంచారు. మా అత్తలను చూసి మేం చాలా నేర్చుకున్నాం. రాజకీయ లబ్ధి కోసం మహిళలను కించపరిచేలా మాట్లాడతారా. ఇలా మాట్లాడితే రాజకీయాలకు మహిళలు వస్తారా?. - చైతన్యకృష్ణ

రాముడికి సీత ఎలాగో... చంద్రబాబుకు భువనేశ్వరి అలా అని నందమూరి వసుంధర వ్యాఖ్యానించారు.

'మహిళలను కించపరచడం సరికాదు.. అహంభావం వీడాలి'

ఇదీచదవండి: Balakrishna Warning TO YCP LEADERS : 'నందమూరి కుటుంబం జోలికొస్తే ఖబడ్దార్'

Last Updated :Nov 20, 2021, 3:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.