ETV Bharat / city

ఉప ఎన్నికలు వస్తే తెరాస భయపడుతోంది: లక్ష్మణ్

author img

By

Published : Oct 15, 2022, 3:39 PM IST

Laxman Comments on TRS: మునుగోడు ఉప ఎన్నిక సీఎం కేసీఆర్ అహంకారానికి, ప్రజల ఆత్మ గౌరవానికి మధ్య జరుగుతుందని భాజపా రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజా మద్దతు కోసం రాజీనామాలు చేసి ఉద్యమానికి ఊపిరి పోసిన తెరాస.. ఇప్పుడు అవే ఉప ఎన్నికలు వస్తే ఎందుకు భయపడుతుందని విమర్శించారు. మునుగోడులో మంత్రులు, 86 మంది ఎమ్మెల్యేలు మకాం వేయాల్సిన అవసరం ఏముందన్నారు.

Laxman
Laxman

Laxman Comments on TRS: మునుగోడు ఉపఎన్నికతో తెరాస నాయకులు, శ్రేణులు కుంగిపోతున్నారని భాజపా ఓబీసీ మోర్ఛా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉప ఎన్నికలను గీటు రాయిగా తీసుకుని ప్రజా మద్దతు కూడగట్టుకోవడానికి రాజీనామాలు చేసి ఉద్యమానికి ఊపిరి పోస్తే.. ఇప్పుడు అవే ఉప ఎన్నికలు రాష్ట్రంలో ఎక్కడ వచ్చినా తెరాస ఎందుకు భయపడుతుందని ప్రశ్నించారు. మునుగోడులో మంత్రులు, 86 మంది ఎమ్మెల్యేలు మకాం వేయాల్సిన అవసరం ఏముందన్నారు. కులాలు, గ్రామాల వారీగా మద్యం, డబ్బులు పంచుతూ ప్రజాభిప్రాయాన్ని కూడగట్టుకొనే ప్రయత్నం చేస్తోందని లక్ష్మణ్ విమర్శించారు.

మునుగోడు ఉప ఎన్నిక ప్రజల ఆత్మగౌరవానికి, కేసీఆర్ కుటుంబ అహంకారానికి మధ్య జరుగుతుందని లక్ష్మణ్ ఆరోపించారు. కేసీఆర్ అసహనంతో మునుగోడులో లబ్ది పొందేందుకు కొత్త మండలంతో పాటు గిరిజన బంధు ప్రకటించారని మండిపడ్డారు. కుల వృత్తులపైన ఆధారపడిన బీసీల ఫెడరేషన్, కార్పొరేషన్లకు ఎందుకు నిధులు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఓడిపోతామనే భయంతోనే తోక పార్టీలని విమర్శించిన కమ్యూనిస్టులతో కేసీఆర్ జత కట్టారని లక్ష్మణ్ దుయ్యబట్టారు.

ఉపఎన్నికలు వస్తే తెరాస భయపడుతోంది: లక్ష్మణ్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.