ETV Bharat / city

Talasani : 'సర్కార్ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు'

author img

By

Published : Jun 15, 2021, 1:24 PM IST

సర్కార్ భూములపై కన్నేస్తే కఠిన చర్యలుంటాయని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. ప్రభుత్వ భూముల్లో అక్రమ కట్టడాలు తొలగించాలని అధికారులను ఆదేశించారు.

Minister Talasani, Talasani Srinivas Yadav
మంత్రి తలసాని, తలసాని శ్రీనివాస్ యాదవ్

ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే ఎంతటివారైనా విడిచిపెట్టేది లేదని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. పార్టీ పేరు చెప్పి అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

హైదరాబాద్​ అమీర్​పేట్​లోని బాపూనగర్​లో పర్యటించిన తలసాని.. ప్రభుత్వ భూములపై జీహెచ్​ఎంసీ అధికారులు చేపట్టిన సర్వేను పర్యవేక్షించారు. బాపూనగర్​లో సుమారు 400 గజాల స్థలాన్ని అధికార పార్టీ నేతలు ఆక్రమించారన్న ఫిర్యాదుపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ భూములు గిరిజనులకు సంబంధించినవని.. వాటి ఆక్రమణకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. బాపూనగర్​లో కమిటీ హాల్​ నిర్మాణానికి భూసేకరణ చేయాలని అధికారులను ఆదేశించారు. సర్కార్ భూముల్లో అక్రమ కట్టడాలను తొలగించాలని చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.