ETV Bharat / city

'ఉద్యోగులు పారదర్శకంగా పనిచేస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తున్నారు'

author img

By

Published : May 8, 2022, 11:49 AM IST

Minister Srinivas Goud: ఉద్యోగ, ఉపాధ్యాయుల నూతన పెన్షన్ విధానంపై రాజీలేని పోరాటం చేయాలని... దానికి రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఉంటుందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మన్యం హక్కుల కోసం వీరోచితంగా పోరాడిన యోధుడు అల్లూరి అని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక మహనీయులను స్మరించుకుంటున్నామని వ్యాఖ్యానించారు.

Minister Srinivas Goud
Minister Srinivas Goud

Minister Srinivas Goud: ఉద్యోగులు పారదర్శకంగా పనిచేస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తున్నారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల నూతన పెన్షన్ విధానంపై రాజీలేని పోరాటం చేయాలని... దానికి రాష్ట్ర ప్రభుత్వ సహాకారం ఉంటుందని తెలిపారు. హైదరాబాద్‌లో భాగ్యనగర్ టీఎన్జీవోస్ గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీ కార్యాలయాన్ని తెలంగాణ ఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు రాజేందర్​తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఏపీఎన్జీవోలో అంతర్భాగంగా ఉన్న ఈ అసోసియేషన్... రాష్ట్ర విభజన అనంతరం తమ హక్కుల సాధన కోసం నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామమన్నారు. ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పారు. ఉద్యోగుల సమస్యలు కొన్ని పెండింగ్‌లో ఉన్నాయని... వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి తెలిపారు.

'ఈ పెన్షన్ విధానం దేశ వ్యాప్తంగా అమలువుతోంది. కనుక పార్లమెంట్లో​ బిల్లు పెట్టి తీసివేయవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రాలకు అధికారం లేదు. ఖచ్చితంగా దాని విషయంలోనూ రాజీలేని పోరాటం తెలంగాణ ఉద్యోగులు చేస్తారు. ప్రభుత్వం సహకారం ఉద్యోగులకు ఎల్లప్పుడూ ఉంటది.'-మంత్రి శ్రీనివాస్‌గౌడ్

మన్యం హక్కుల కోసం.. వీరోచితంగా పోరాడిన యోధుడు అల్లూరి సీతారామరాజు అని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, క్షత్రీయ సేవా సమితి ‍ఆధ్వర్యంలో అల్లూరి 98వ వర్ధంతి సభను హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించారు. ఆంగ్లేయుల గుండెల్లోకి దూసుకుపోయిన విప్లవ బాణం అల్లూరి అని... మంత్రి కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎంతో మందికి గుర్తింపు లేకుండా పోయిందన్న శ్రీనివాస్‌ గౌడ్‌... కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రానికి చెందిన మహనీయులను స్మరించుకుంటూ అధికారికంగా జయంతి, వర్ధంతులు నిర్వహించుకుంటున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి:మమ్మీ చేతిలో రిమోట్‌... డమ్మీ చేతిలో పాలన: కేటీఆర్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.